లాభాల్లో విశాఖ ఉక్కు.. కేంద్రం కళ్లు తెరుస్తుందా?

Chakravarthi Kalyan
ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా అనేక ఉద్యోమాలు జరుగుతున్నాయి. కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు అంతా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా.. ఎవరు చేసినా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిపోయిందని కేంద్రం చెబుతోంది. ఇది కేవలం విశాఖ ఉక్కు ఒక్కటి మాత్రమే కాదని.. ఇది విధాన నిర్ణయం అని కేంద్రం సమర్థించుకుంటోంది.

కానీ ఇప్పుడు కేంద్రం కళ్లు తెరవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే.. ఆరేళ్ల తర్వాత లాభాల విశాఖ ఉక్కు లాభాలబాట పట్టింది.  2021-22లో టాక్స్ కి ముందు 835 కోట్ల లాభాన్ని సంపాదించినట్టు విశాఖ ఉక్కు సిఎండి అతుల్ భట్ ప్రకటించారు. అన్ని సూచికల్లోనూ గణనీయమైన పురోగతి నమోదయిందని.. ఇది  కేవలం సమిష్టి కృషితోనే సాధ్యమైందని విశాఖ ఉక్కు సిఎండి అతుల్ భట్ తెలిపారు. బొగ్గుకొరత, అంతర్జాతీయంగా వచ్చిన సవాళ్లను అధిమించి మరీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఈ కొత్త రికార్డులను నెలకొల్పిందని విశాఖ ఉక్కు సిఎండి అతుల్ భట్ తెలిపారు.

స్టీల్ అమ్మకాల్లో 57 శాతం వృద్దిని నమోదు చేసిన విశాఖ స్టీల్.. 2020-21లో 17978 కోట్ల అమ్మకాలు జరిపింది. అదే విశాఖ ఉక్కు..  2021-22లో 28082 కోట్ల రూపాయిల అమ్మకాలు జరిపి ఉక్కు కర్మాగారం చరిత్రలోనే అత్యధిక రికార్డు నమోదు చేసిందట. అలాగే ఉప ఉత్పత్తులలో 44 శాతం వృద్ది సాధించిందని.. ఎగుమతుల్లో 37 శాతం వృద్ది సాధించిందని విశాఖ ఉక్కు సిఎండి అతుల్ భట్ తెలిపారు. మార్చి 2022 నెలలో 3685 కోట్ల రూపాయిల ఉక్కు అమ్మకం ద్వారా ప్లాంట్ చరిత్రలోనే రికార్డు  సృష్టించామని విశాఖ ఉక్కు సిఎండి అతుల్ భట్ వివరించారు.

నాల్గో త్రైమాసికంలో అత్యధికంగా బొగ్గు కొరతను ఎదుర్కొన్నామని.. అయినా రెండు బ్లాస్ట్ ఫర్నేస్ లతోనే రికార్డు స్దాయి ఉత్పత్తి సాధించగలిగామని విశాఖ ఉక్కు సిఎండి అతుల్ భట్ తెలిపారు. మరి ఈ లెక్కలు చూసిన తర్వాతయినా కేంద్రం కళ్లు తెరవాలని కార్మికులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: