ఎంఐఎం కార్పొరేటర్ ను అరెస్ట్ చేయించిన మంత్రి కేటీఆర్ ?

VAMSI
తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం రాజుకుంది. బొలకపూర్ డివిజన్ ఎం ఐ ఎం కార్పొరేటర్ అరెస్ట్ తో అక్కడ వాతావరణం హాట్ హాట్ గా మారింది. ముషీరాబాద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన భోలకపూర్ డివిజన్ ఎం ఐ ఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ ఉద్దీపన్ ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఏప్రిల్ 4 అనగా సోమవారం నాడు మహమ్మద్ గౌస్ పోలీసులతో వాగ్వాదానికి దిగి రభస చేసిన విషయం తెలిసిందే. వారి మాటలను వ్యతిరేకించడమే కాకుండా వారితో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ విషయం చివరకు మంత్రి కెటిఆర్ వరకు వెళ్ళడంతో ఆయన పక్షపాతం లేకుండా ఆయనను వెంటనే అరెస్ట్ చేయమని ఆదేశాలు జరి చేశారు.
స్వయంగా రాష్ట్ర మంత్రి ఆదేశించడంతో వెనక్కు తగ్గని పోలీసు అధికారులు కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం ఏప్రిల్ 4 వ తేదీన అర్ధరాత్రి సమయం లో కూడా.. బోలక్‌పూర్‌లో వ్యాపారస్తులు దుకాణాలను  తెరిచి ఉంచడం తో అది గమనించిన పోలీసులు వ్యాపారస్తులకు దుకాణాలు మూసి వేయాలని సూచించారు. అయితే పోలీసుల మాటలను వ్యతిరేకిస్తూ దుకాణదారులు వారిపై రచ్చకు దిగారు. రంజాన్ సందర్భంగా మా వ్యాపార నిమిత్తం  దుకాణాలను రోజంతా తెరిచి ఉంచుతాం అంటూ  దుకాణాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అలా అక్కడ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడికి  కార్పొరేటర్ గౌసుద్దీన్ వచ్చారు. అసలు విషయం తెలుసుకుని పోలీసులతో మాట్లాడారు. అయితే వారు ఇంతకీ వినకపోవడంతో పోలీసులపై దుర్భాషలాడుతూ  వాగ్వాదం పెంచారు . అంతేకాదు వారిపైకి వెళ్లి దౌర్జన్యం చేస్తూ... దుకాణాలు మూసేది లేదని తేల్చి చెప్పారు. అది కాస్త వీడియో రూపం లో బయటకు రావడం తో విషయం వైరల్ గా మారింది. చివరకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి కార్పొరేటర్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: