కొడుకు కళ్లలో కారం కొట్టిన తల్లికి.. సన్మానం?

praveen
మహిళ అబల కాదు సబల అని చెబుతూ ఉంటారు. ఇక ప్రమాదం వచ్చినప్పుడు అపర కాళిలా మారిపోతుంది అని అంటూ ఉంటారు.  కానీ నేటి రోజుల్లో మాత్రం ఎంతో మంది మహిళలు యువతులు కూడా చిన్న సమస్య వస్తే చాలు భయపడిపోతున్నారు. సమస్య నుంచి దూరంగా పారిపోతున్నారు.  కానీ ధైర్యంగా నిలబడి సమస్యను ఎదుర్కోవాలని మాత్రం ఆలోచన చేయడం లేదు. ముఖ్యంగా  నేటి రోజుల్లో మహిళపై అత్యాచారం జరుగుతున్న నేపథ్యంలో మహిళలు ధైర్యంగా తిరగబడితే..  ఇలాంటి సంఘటనలు జరగవు అంటు ఎంతో మంది మహిళా సంఘాల నేతలు కూడా సూచిస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం మహిళలు యువతులు ఇంకా భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు అన్నది తెలుస్తుంది.

 కాని కొంతమంది మహిళలు మాత్రం ఏకంగా ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అపర కాళిలా మారిపోయి ధైర్యంగా నిలబడి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. ఇలా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్న ఎంతోమంది పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల సూర్యాపేటలోని కోదాడ లో జరిగిన ఘటన సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంజాయి కి బానిస గా మారిపోయిన కొడుకును దారిలోకి తెచ్చేందుకు ఆ తల్లి చేసిన పని పై అందరూ ప్రశంసలు కురిపించారు.

 గంజాయి కి బానిస గా మారినా కొడుకుని దారిలోకి తెచ్చేందుకు ఏకంగా కళ్ళల్లో కారం కొట్టి ధైర్యసాహసాలు ప్రదర్శించినా ఆ తల్లి పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయ్. ఇటీవలే ఆమె కు సన్మానం చేశారు మహిళా సంఘాల ప్రతినిధులు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. 15 ఏళ్ల కుమారుడు గంజాయి బానిసలుగా మారిపోయి ఇంటికి రావడం చూసిన తల్లి అతని భవిష్యత్తు నాశనం కాకూడదని కంట్లో కారం కొట్టి ఇక అతని దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నించడం గొప్ప విషయమని ఇక మహిళలు అందరూ కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఇలాంటి ధైర్యసాహసాలు ప్రదర్శించి సమస్యను పరిష్కరించుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు సూచించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: