సీఎం కేసీఆర్ కు బెడ్ రెస్ట్... డాక్టర్లు ఏమి చెప్పారో తెలుసా?

VAMSI
తెలంగాణ యోధుడు తన పోరాట పటిమతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు కేసీఆర్. ఇప్పటికీ అయన వల్లే ప్రత్యేక తెలంగాణ సాధ్యం అయిందని ప్రజలు ఆయనను దేవుడిలా కొలుస్తారు. ప్రస్తుతం ఆ ప్రజల అశీసులతో సీఎంగా రెండవ సారి పాలనా కొనసాగిస్తున్నాడు. ప్రజల క్షేమమే పరమావధిగా తాను ప్రవేశ పెడుతున్న ఒక్కొక్క పధకం ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. కాగా వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే కేసీఆర్ సమాయత్తం అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఎప్పటి నుండో తనకు కలగా మిగిలిపోయిన అంశం దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడం. 

అందుకోసం బీజేపీ కి వ్యతిరేకంగా ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం కోసం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం పలు మార్లు ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుస్తూ వారి మద్దతును కూడ గట్టుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం అదే పని మీద ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి సతీసమేతంగా వెళ్లారు. ఇందులో మతలబు ఏమిటో తెలియకపోయినా ఏదో వ్యూహం ఉండనే తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ ని కలవడానికి అనుమతి దొరకలేదని తెలుస్తోంది. ఈ లోపు అయన ఆరోగ్య విషయంపై దృష్టి సారించారు.

కేసీఆర్ గత కొన్ని రోజులుగా పంటి నొప్పి తో ఇబ్బంది పడుతున్నారట. అందుకే నిన్న డాక్టర్ ను సంప్రదించగా ఒక పంటిని తీసి వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు చిన్న పాటి శస్త్ర చికిత్స జరగడం కారణంగా డాక్టర్లు రెండు రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట. అయితే ఇంకెన్ని రోజులు ఢిల్లీ లో ఉంటారు అనేది తెలియాల్సి ఉంది. కాగా రానున్న రెండు రోజుల తర్వాత అయినా కేసీఆర్ కు ప్రధాని మోదీని కలవడానికి అనుమతి దొరుకుతుందా అన్నది తెలియాల్సి ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: