ఇండియా, చైనా కలిసి కొత్త గేమ్.. ఏంటంటే?

praveen
ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. రష్యా సేనలు భీకర రీతిలో దాడులు చేస్తున్న నేపథ్యంలో.. చిన్న దేశమైన ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయ్. అయితే తక్కువ సైన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఉక్రెయిన్ సైన్యం మాత్రం  ఎంతో వీరోచితంగా రష్యాతో పోరాటం చేస్తోంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఉక్రెయిన్ సైనికుల తెగింపుకు రష్యన్ సైనికులు భయపడిపోతున్న పరిస్థితులు నెలకొంది. ఏదేమైనా ఇక రష్యా దాడిలో మాత్రం ఉక్రెయిన్ మారణహోమం జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి సమయంలోనే కొన్ని దేశాలు అటు రష్యా కి మద్దతు ఇస్తూ ఉంటే మరికొన్ని దేశాలు ఉక్రెయిన్ కి మద్దతు ఇస్తున్నాయి.

 అమెరికా యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు ఒక ఉక్రెయిన్ కు మద్దతు గా ఉన్నాయ్. ప్రపంచ దేశాలు ఇక ఉక్రెయిన్ కు మద్దతుగా నిలవాలని రష్యా వైఖరిని ఖండించాలి అంటూ కోరుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే చైనా సహా మరికొన్ని దేశాలు రష్యాకు మద్దతుగా ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. కానీ అటు భారత్ మాత్రం మొదటినుంచి తటస్థ వైఖరిని వ్యవహరిస్తూ వస్తుంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఏకంగా రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఇక భారత రక్షణ సలహాదారు అజిత్ దోవల్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చలు జరిపారు..

 ఈ చర్చల్లో భారత్ చైనా సరిహదులతో నెలకొన్న పరిస్థితులతో పాటు.. ఉక్రెయిన్ రష్యా మధ్య తలెత్తిన యుద్ధం గురించి కూడా చర్చించారు. ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోవాలి అంటూ ఇక చైనా భారత దేశాలు స్టేట్మెంట్ ఇచ్చాయ్. ఇందులోనే చిన్న మెలిక ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ఉక్రెయిన్లో ఇరుదేశాలు యుద్ధం చేస్తున్నాయని.. ఇక ఇరు దేశాల యుద్ధాన్ని ఆపేసి శాంతియుతంగా చర్చలు జరుపితేనే పరిస్థితులు అదుపులోకి వస్తాయి అన్న కోణంలో స్టేట్మెంట్ ఇచ్చాయి చైనా భారత్ లు. ఇక ఈ రెండు దేశాలు ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: