ఇక ఆ డిపోల మూసివేత తప్పదా..!

MOHAN BABU
 ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ చాలా వెనకబడి పోయింది. దీన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు కానీ కార్మికుల నిర్విరామ సమ్మె తో వెనక్కి తగ్గి మళ్లీ దాన్ని నడిపిస్తున్నారు. ఈమధ్య సజ్జనార్ ఎండి గా వచ్చిన తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది. కానీ ఇంతలోనే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మరో షాక్ తగిలింది. మరి అది ఏంటో తెలుసుకుందామా..?

 ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీకి రవాణా శాఖ షాకిచ్చింది. ఈ తరుణంలో బస్సుల సంఖ్య మరింత తగ్గిపోతుంది. నిబంధనల ప్రకారం చూస్తే 15 సంవత్సరాలు దాటిన బస్సులను నడప వద్దు అంటూ రవాణా శాఖ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆర్టీసీ లో ఉన్నటువంటి బస్సుల  సంఖ్య భారీగా తగ్గిపోయింది. పోయినేడాది లెక్కల ప్రకారం చూసుకుంటే మొత్తం 90 డిపోల పరిధిలో 9708బస్సులు తిరిగాయి. ఇందులో దాదాపు మూడు వేలకు పైగా అద్దె బస్సులు. అయితే ఈ బస్సుల కాలం చెల్లింది కాబట్టి 600 బస్సులను పక్కన పెట్టనున్నారు. వాటి స్థానంలో  అద్దె ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఆర్టీసీ సంస్థ ఉన్నటువంటి బస్సుల్లో వాటి కండిషన్ మీద రివ్యూ నిర్వహించారు ఎండి  సజ్జనార్. మొత్తం 97 డిపోల వారిగా బస్సులు అవి తిరుగుతున్న అటువంటి రోడ్లు, ఆదాయం మరియు సిబ్బంది నష్టంతో పాటుగా డిపోకు ఉన్న భూముల గురించి  సమగ్రంగా వివరాలు సేకరించినట్టు తెలుస్తున్నది. ఇందులో లాభనష్టాల ఎజెండా ప్రాతిపదికగానే ఎండి సజ్జనార్ ఈ రివ్యూ చేసినట్టు సమాచారం. 97 డిపోలో కూడా నష్టాల్లోనే ఉన్నాయని కొన్నింటిలో నష్టాలు మూడింతల గా ఉన్నట్లు తేలింది. దీని ఫలితంగా మొదట కొన్ని డిపోలను మూసేసి అక్కడి సిబ్బంది వేరే డిపోల సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుట్ల,మెట్పల్లి, హుజురాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ 2 లేదా హనుమకొండ డిపో, ఘన్పూర్, నల్గొండ జిల్లా నార్కట్పల్లి డిపో లను మూసి వేస్తారని  ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ డిపోలకు చెందినటువంటి బస్సులను ఈమధ్య పక్క డిపోలకు కూడా పంపించారు. అలాగే ఒక్కో డిపోలో కనీసం 121 బస్సులు ఉండాల్సి ఉండగా 80 వరకు తగ్గించారు. ఇందులో కాలం చెల్లిన బస్సులు సగం వరకు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ 3, మియాపూర్ డిపోలను మూసేశారు. ఈమధ్య పికెట్ డిపో క్లోజ్ అయినట్టు కూడా సమాచారం. అయితే ఎక్కువ నష్టాలు వస్తున్న నేపథ్యంలో 17 డిపోలను మొదటి విడతలో మూసివేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడనున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: