యూపీ: సీఎంగా "యోగి ఆదిత్యానాధ్"... ప్రమాణస్వీకారం అప్పుడే?

VAMSI
దేశ రాజకీయాల్లో మొన్న వచ్చిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి మోదీ అమిత్ షా ల వ్యూహం సక్సెస్ అయింది. దాని ఫలితమే, ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఘన విజయం సాధించాయి. దీనితో మరో సారి మాకు తిరుగులేదు అని మోదీ నిరూపించి చూపాడు. అయితే ఎన్నికల ముందు వరకు ప్రజల్లో ఉన్న కొన్ని విషయాలు ఇబ్బంది పెడుతాయని భావించినా అవేమీ మోదీ అమిత్ షా ల వ్యూహాల ముందు నిలవలేకపోయాయి. ఈ నాలుగు రాష్ట్రాల విజయాలతో ప్రత్యేకమైనది ఉత్తరప్రదేశ్ అని చెప్పాలి. ఇది దేశంలోనే నియోజకవర్గాల వారీగా పెద్ద రాష్ట్రం.
ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ 273 స్థానాల్లో విజయం సాధించి మళ్ళీ రెండవ సారి వరుసగా అధికారంలోకి వచ్చింది. మరియు బీజేపీ తర్వాత సమాజ్ వాది పార్టీ 123 స్థానాలలో గెలుపొందింది. ఇక కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకు పరిమితం అయింది. ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్న యోగి ఆదిత్యానాధ్ మళ్ళీ గోరఖ్ పూర్ అర్బన్ నుండి ఎమ్మెల్యే గా గెలిచాడు. ఈ విజయంతో సీఎంగా ఉంటూ తర్వాత జరిగిన ఎన్నికలో గెలిచిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. దానితో మళ్ళీ ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందు కోసం అధిష్టానంతో చర్చించిన యోగి ఆదిత్యనాధ్ ఈ నెల 25 న అధికారికంగా యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి పీఎం నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి అమిత్ షా మరియు కొందరు బీజేపీ పెద్దలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలతో బీజేపీ కి తిరుగులేదని మరోసారి రుజువయింది. మరి ఈ సారి యోగి కాబినెట్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: