బయటకెళ్తున్నారా.. వాతావరణశాఖ వార్నింగ్‌?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలోని 8 జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్‌ నమోదు కావడంతో బయటకు వెళ్తే జాగ్రత్త అని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఇవాళ్టి నుంచి రెండు రోజులు వడ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్‌ ఇచ్చింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు వీస్తాయట.

అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోనూ వడగాలులు వీచే అవకాశం ఉందట. అందుకే ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ ద్వారా వాతావరణ శాఖ హెచ్చిరిస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా 40 డిగ్రీల పైనే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. వచ్చే ఐదు రోజుల్లో ఇవి మరింత పెరిగే చాన్స్‌ ఉందట. శని, ఆదివారాల్లో టెంపరేచర్లు 43 నుంచి 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

శుక్రవారం నల్గొండ జిల్లాలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. ఇక్కడ  43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో నిజామాబాద్‌లో 41.2 డిగ్రీలు ఉష్ణోగ్రత..  భద్రాచలం, రామగుండంలో 41 డిగ్రీలు.. ఆదిలాబాద్‌లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.

ఇక మహబూబ్‌నగర్‌లోనూ పై జిల్లా కంటే కాస్త తక్కువగా 40.5 డిగ్రీలు, మెదక్‌లో 40.2, హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలంగాణ వాతావరణ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఎండలు ముదరడంతో పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభించారు. అయినా విద్యార్థలు విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు మంచినీరు ఎక్కువాగ తాగేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఎండలు పెరిగిన దృష్ట్యా తగిన జాగ్రత్తలతోనే బయటకు వెళ్లడం మంచింది. నిర్ణీత సమయానికి అనుగుణంగా ద్రవాలు తీసుకుంటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: