కేంద్రానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..

Purushottham Vinay
కేంద్రంలోనే బీజేపీ పార్టీ (BJP)పై టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీ నాయకుల మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలో మొదలైన ఈ మాటల యుద్ధం ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ (KTR) మరోసారి కేంద్రంపై బాగా విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కేటీఆర్‌. హైదరాబాద్‌ నాలా అభివృద్ధిపై అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో కేటీఆర్‌ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని తేల్చి చెప్పారు కేటీఆర్‌.ఇక ఈ సందర్భంగా కంటోన్మెంట్‌కు ఆయన చాలా గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు.ఇక ఈ విషయమై కేటీఆర్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘కంటోన్మెంట్‌ ఏరియాలో నాలాలపై చెక్‌డ్యామ్‌లు కట్టడం వలనే కాలనీలు మునిగిపోతున్నాయి.ఇలా ఇక ఎన్నిసార్లు చెప్పినా కాని అక్కడి అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. 


ఇకపై ఇలా చేస్తే చూస్తూ ఊరుకోం.. ప్రజల కోసం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తే కంటోన్మెంట్‌కు నీళ్లు ఇంకా కరెంటుని ఖచ్చితంగా కట్‌ చేస్తామ’ని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు.ఇక అలాగే అధికారులతో కూడా ఇక ఆఖరిసారి చర్చల ని జరపాలనీ.. వారు గనుక వినకపోతే నీళ్లు ఇంకా కరెంట్‌ కట్‌ చేయాలనీ..అలాగే అసెంబ్లీలోనే ఉన్న స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీకి ఆదేశాలిచ్చారు మంత్రి కేటీఆర్‌. అలాగే గతంలో చాలాసార్లు కంటోన్మెంట్‌ ఇష్యూపై మాట్లాడిన కేటీఆర్‌ గారు.. ఇప్పుడు ఈ స్థాయిలో వార్నింగ్‌ ఇవ్వడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతోందని చెప్పాలి. ఇక కంటోన్మెంట్‌ అంటే హైదరాబాద్‌తో కలిసిమెలిసి ఉండాలని.. ఇలా ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే చూస్తూ అసలు ఊరుకోబోమనీ ఫుల్ గా క్లారిటీ ఇచ్చారు కేటీఆర్‌.ఇక ఇప్పుడు కేంద్రానికి వార్నింగ్ ఇస్తూ కేటీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: