కొడాలి ప్లేస్...రీప్లేస్ చేస్తారా?

M N Amaleswara rao
ఇటీవల కాలంలో ఏపీ మంత్రివర్గంలో మార్పులు గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..త్వరలోనే జగన్..మంత్రివర్గంలో మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతుంది. కాకపోతే కరెక్ట్‌గా ఎప్పుడు జరుగుతుందో తెలియదు గాని..ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల తర్వాత మాత్రం క్యాబినెట్‌లో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది...అయితే మొత్తం మంత్రివర్గాన్ని మార్చేస్తారా..లేక కొంతమందిని కంటిన్యూ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ అందరినీ పక్కనబెడితే మాత్రం..ఇప్పుడున్న అందరూ సైడ్ అవ్వాల్సిందే..అలాగే జగన్‌కు సన్నిహితంగా ఉండేవారు కూడా తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని సైతం పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది...అసలు కొడాలి నాని...ప్రభుత్వానికి ఏ విధంగా రక్షణగా నిలుస్తారో చెప్పాల్సిన పని లేదు..జగన్ మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటారు...ఎవరైనా తమ ప్రభుత్వంపై గాని, జగన్‌పై గాని విమర్శలు చేస్తే ఊరుకోరు..వెంటనే విమర్శలు చేసిన వారికి కౌంటర్లు ఇచ్చేస్తారు.
ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లపై ఏ స్థాయిలో విరుచుకుపడతారో అందరికీ తెలిసిందే...ఇంకా చెప్పాలంటే పరుష పదజాలంతో ఫైర్ అవుతారు..అలా చేయడం వల్లే కాస్త ప్రభుత్వం నెగిటివ్ అవ్వకుండా ఉందని చెప్పొచ్చు...లేదంటే టీడీపీ చేసే విమర్శలకు వైసీపీకి ఇంకా డ్యామేజ్ అయ్యేది..అలా జగన్ ప్రభుత్వానికి కొడాలి ఒక కవచం మాదిరిగా ఉన్నారని చెప్పొచ్చు.
మరి అలా కవచం మాదిరిగా ఉండే కొడాలిని తప్పిస్తే ప్రభుత్వానికి కాస్త బలం తగ్గుతుందని చెప్పొచ్చు...ఇక కొడాలి ప్లేస్‌ని రీప్లేస్ చేసే నాయకుడుని క్యాబినెట్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది..అసలు కొడాలి ప్లేస్‌ని రీప్లేస్ చేసే సత్తా ఎవరికి లేదనే చెప్పాలి..కొడాలి రాజకీయ శైలితో ఎవరు మ్యాచ్ అవ్వరు..అయితే తప్పదు అనుకుంటే కొడాలి ప్లేస్ ఒక కమ్మ నేతకు ఇవ్వాలి..ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న చర్చ ప్రకారం...జగన్ ప్రోగ్రాంలు చూసుకునే ఎమ్మెల్సీ తలశిల రఘురాంని మంత్రివర్గంలో తీసుకోవచ్చని కొత్త ప్రచారం వస్తుంది..ఉన్న కమ్మ నేతల్లో ఆయన కాస్త బెటర్ అని అంటున్నారు. అసలు చూడాలి జగన్...కొడాలి నానిని పక్కన పెట్టి, వేరే కమ్మ నేతకు ఛాన్స్ ఇస్తారో లేదో?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: