పోలీసులపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం సబబేనా ... ?

VAMSI
ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. మాములుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేల హవానే నడుస్తో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ను కాపాడే పోలీసులే వారి దెబ్బకు హడలిపోతుంటారు. ఈ విధంగా చాలా సంఘటనలు జరిగాయి. అయితే తాజాగా నిన్న ఏపీలో ఒక సంఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ మంత్రి పోలీసులపై ఫైర్ అయిన సంఘటన తెగ వైరల్ అవుతూ ఉంది. అయితే ఎందుకు మంత్రి వారిపై ఫైర్ అవ్వాల్సిన అవసరమా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇంతకీ పోలీసులు చేసిన ఏ పని వలన మంత్రి కోపానికి కారణం అయ్యి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారో తెలుసా?
నిన్న అనగా శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇంఛార్జి  మంత్రిగా ఉన్నటటువంటి పేర్ని నాని కూడా పర్యటనకు వెళ్లారు.  కాగా అక్కడ జరిగిన సంఘటన కారణంగా మంత్రి పేర్ని నాని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్నటువంటి కొందరు పోలీసులు.. పార్కింగ్‌ చేసిన  కారును అక్కడి నుండి తీయాలంటూ చెప్పడంతో మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. విషయం తెలియడంతో వెంటనే పోలీసులపై మండిపడ్డారు. ఇక్కడ నుండి కారు తీయమని చెప్పింది ఎవరు అన్నారు ? నేను ఎవరో ? నా హోదా ఏమిటో తెలుసా లేదా అంటూ పోలీసుల పై నిప్పులు చెరిగారు.
అంతే కాకుండా అక్కడ  ఎస్పీ, డీఐజీ కార్లు పార్క్‌ చేసి  ఉండటంతో కోపంతో మరింత ఊగిపోయారు, ఇదేంటి అంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఇక పోలవరం పర్యటనకు వెళ్ళిన సిఎం జగన్ పర్యటన ప్రశాంతంగా ముగిసింది.  అక్కడి పనులను ఇంకా వేగవంతం చేయాలని సిఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరి వారి డ్యూటీ వారు చేశారు, ఇందులో తప్పు ఏముంది. చట్టం, న్యాయం, ట్రాఫిక్ రూల్స్ ముందు ఎవ్వరైనా సమానమే అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: