జనసేనపై ఆశలు లేవంటున్న చింతమనేని?

M N Amaleswara rao
నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తే ఎంతో కొంత బెనిఫిట్ అవుతుందని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. జనసేనతో గాని పొత్తు పెట్టుకుంటే ఈజీగా గెలవచ్చని అనుకుంటున్నారు..2014 ఎన్నికల్లో పవన్ సపోర్ట్ చేయడం వల్లే వెస్ట్‌లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది..అయితే 2019 ఎన్నికల్లో పవన్ సెపరేట్‌గా పోటీ చేయడం వల్ల టీడీపీ బాగా లాస్ అయింది. అందుకే 2024 ఎన్నికల్లో పవన్‌ని కలుపుకుంటేనే ప్లస్ అవుతుందనే గోదావరి నేతలు భావిస్తున్నారు.
అయితే వెస్ట్ గోదావరిలో మెజారిటీ టీడీపీ నేతలకు పవన్ వల్ల ప్లస్ ఉంటుదనే చెప్పొచ్చు..కానీ కొందరికి అంత పవన్ వల్ల పెద్దగా అడ్వాంటేజ్ ఉండదనే చెప్పాలి. అలా పవన్ వల్ల బెనిఫిట్ పెద్దగా లేని వారిలో టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కూడా ఒకరు...పవన్ గాని టీడీపీతో కలిస్తే చింతమనేనికి పెద్దగా ప్లస్ ఉండదు. ఎందుకంటే దెందులూరులో జనసేన ప్రభావం చాలా తక్కువ అని చెప్పొచ్చు.


గత ఎన్నికల్లో చింతమనేని..వైసీపీ నేత అబ్బయ్య చౌదరీ చేతిలో 17 వేల ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయారు...ఇక ఇక్కడ జనసేనకు 6 వేల ఓట్ల వరకు పడ్డాయి..అంటే ఈ ఆరు వేల ఓట్ల వల్ల చింతమనేనికి పెద్దగా ఉపయోగం లేదు. పైగా ఇక్కడ పవన్ ఫ్యాన్స్...చింతమనేనికి యాంటీగా ఉంటారు..కాబట్టి వారు చింతమనేనికి ఓట్లు వేస్తారనేది చెప్పలేం. గతంలో చింతమనేని, పవన్‌ల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పవన్ ఫ్యాన్స్..చింతమనేనిపై యాంటీగా ఉన్నారు.
కాబట్టి నెక్స్ట్ టీడీపీ-జనసేన కలిసిన సరే..చింతమనేనికి దెందులూరులో ఒరిగేది ఏమి లేదు. ఏదో టీడీపీ బలం, సొంత ఇమేజ్‌తోనే చింతమనేని గెలవాల్సి ఉంటుంది. ఆ దిశగానే చింతమనేని ముందుకెళుతున్నారు. అంతే తప్ప పొత్తుపై మాత్రం చింతమనేని ఆశ పెట్టుకోలేదనే చెప్పొచ్చు. చూడాలి ఈ సారి దెందులూరులో చింతమనేని సొంతంగా సత్తా చాటుతారో లేదో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: