రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన వి హనుమంతన్న?

VAMSI
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మాజీ ఎంపీ వి హనుమంతరావు అప్పుడప్పుడు సమకాలీన రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాము. నాయకుడు ఎంతవాడైనా ఎటువంటి బెరుకు లేకుండా ఉన్న విషయాన్ని అడిగేయగల సమర్ధుడు. ఈ గుణం వల్లనే ఎన్నో సార్లు వివాదాలు పాలయ్యాడు. తాజాగా ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తనదైన శైలిలో రెచ్చిపోయారు హనుమంతరావు. ఇంతకీ అసలు ఏమైందంటే, కాంగ్రెస్ అధిష్టానం ప్రావర్తిస్తున్న తీరును కూడా ఈయన ఎండగట్టాడు. ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన నాయకులు ఎందరో ఉన్నారు.
అయితే నిన్న మొన్న టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని తన మనసులో మాట చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న నేతలకు విలువ లేదా అంటూ ప్రశ్నించారు? పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టేస్తున్నారని విహెచ్ వాపోయారు. ఈ విషయాలను డైరెక్ట్ గా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పుకుందాం అంటే మాకు అప్పాయింట్ మెంట్ దొరకడమే గగనంగా మారిందని అన్నారు. అందుకే ఇవాళ మీడియా ముందు ఈ విషయాలను మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు.  
ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా బీహార్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల గురించి చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఎందుకు రేవంత్ రెడ్డి బీహార్ అధికారులను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ విషయంపై బీహార్ నుండి నాకు ఫోన్స్ వస్తున్నాయని చెప్పారు. ఆ ప్రకారం మన అధికారులు సైతం దేశ వ్యాప్తంగా పనిచేస్తున్నారు. కానీ ఎక్కడ నుండి ఇలాంటి విముఖత మన అధికారులపై లేదు. అలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి చెందిన అధికారులు కూడా తెలంగాణాలో పనిచేస్తున్నారు, కానీ వారిని ఎందుకు ఏమీ అనడం లేదు. తక్షణమే ఈ తరహా ప్రవర్తనకు స్వస్తి పలకలనై వి హనుమంతరావు రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: