దేశ్ కి నేత కేసీఆర్.. సీఎం సీటును వదిలేస్తారా..!

MOHAN BABU
ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు. కానీ ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కు సంబంధించి ఆయన దగ్గర  మంచి ఐడియాలు అయిపోయినట్లుగా కనిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కెసిఆర్ సొంత ఐడియా అయిన రైతు బంధు ని పక్కన పెడితే మిగతా అన్ని స్కీములు కూడా దేశవ్యాప్తంగా వేరే పేర్లతో అమలు అవుతూనే ఉన్నాయి. ఏదైనా ఉచితంగా ఇవ్వడం కొత్తదనాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఓటర్లు ప్రతిదీ ఉచితంగా కావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో అవినీతి లేని గుడ్ గవర్నెన్స్ ను కూడా కోరుకుంటున్నారు.

 మంచి పాలనను అందించడం అనేది గొప్ప నైపుణ్యం. గతంలో తెలంగాణ ఓటర్లు, కెసిఆర్ మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు కనుమరుగైపోయింది. మరోవైపు బిజెపి క్రమంగా పుంజుకుంటుంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తాను పోటీలో ఉంటానని సంకేతాలు ఇస్తోంది. తాను ఢిల్లీ గద్దెనెక్కితే తెలంగాణ ఓటర్లు వారు కోరుకున్నది సాధించుకునేందుకు నేషనల్ బడ్జెట్ తలుపులు తెరిచుకుంటాయని కేసీఆర్ ఓపెన్ గా చెబుతున్నారు. కొందరు ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రులను కలవడం ద్వారా కేసీఆర్ జాతీయ నాయకత్వాన్ని సాధించారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ,రాహుల్ గాంధీ విషయంలో కూడా కేసీఆర్ దూకుడుగా వెళ్లడం లేదు. భవిష్యత్తులో గాంధీలతో కలిసి కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ తో కేసీఆర్ పొత్తు పెట్టుకోవడం రాజకీయంగా మంచి ఎత్తుగడే అయిన కేసీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ తో దోస్తీ చేస్తారా లేక తెలంగాణలో కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా? అనేది ఒకటే ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న. వీటికి తోడు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్ సర్వేల తర్వాత తమ సీట్లు కోల్పోయే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ప్రశాంత్ కిషోర్ అసహనాన్ని కలిగించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న ఏమిటంటే..కేసీఆర్ పూర్తిస్థాయి సమయాన్ని జాతీయ రాజకీయాల కోసం కేటాయిస్తారా అనేది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనేది కూడా మరో ప్రశ్న. లేదంటే మిగతా ప్రతిపక్షాల ముఖ్యమంత్రుల మాదిరిగా కేసీఆర్ కూడా పార్ట్ టైమ్ నేషనల్ లీడర్ గా ఉండాలి. తెలంగాణ భవిష్యత్తు ముఖ్యమంత్రిగా,కెసిఆర్ వారసునిగా కేటీఆర్ అవుతారని చాలా రోజులుగా ప్రచారం

 జరుగుతోంది. కెసిఆర్ నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడానికి ఒకరకంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కూడా ఒక కారణమనే వాదన ఉంది. నిజానికి నరేంద్ర మోడీని ఢీ కొట్టేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పెద్దపీట వేస్తే ఉపయోగం ఏమీ ఉండదు. కెసిఆర్ కు ఏదైనా పని చేయగలిగిన ప్రదేశం ఉంది అంటే అది తెలంగాణ మాత్రమే. ఇక్కడ ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇది అని ప్రతిపక్షాలకు తెలుసు. మరి సీఎం పదవికి రాజీనామా చేసి కేటీఆర్ ను  ముఖ్యమంత్రిగా పెట్టడానికి ఇదో సాకా? అనేది కాలమే సమాధానం చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: