జూపూడి పొజిషన్ ఏంటి?

M N Amaleswara rao
అధికారం ఉన్నా సరే కొందరు వైసీపీ నేతల పరిస్తితి పెద్దగా బాగోలేదనే చెప్పాలి..ఏదో అధికారం ఉందనే పేరు తప్ప ఆ నాయకులకు ప్రయోజనం ఏమి ఉండటం లేదు. ఇప్పటికే పలువురు నేతల పొజిషన్ ఏంటో క్లారిటీ లేకుండా ఉంది...అసలు రాజకీయంగా వారికి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో అర్ధం కాకుండా ఉంది. ఇప్పుడు వైసీపీలో ఉన్న సీనియర్ నేత జూపూడి ప్రభాకర్‌కు కూడా అదే పరిస్తితి ఉంది. ఏపీ రాజకీయాల్లో జూపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జూపూడి గతంలో కాంగ్రెస్‌లో తర్వాత...జగన్‌కు అండగా నిలుస్తూ వైసీపీలో కూడా పనిచేశారు..అసలు జగన్ జైలుకెళ్లే సమయంలో జూపూడి అండగా ఉన్నారు. అలా ప్రతిక్షణం జగన్‌కు సపోర్ట్‌గా ఉంటూ వచ్చిన జూపూడి...అనూహ్యంగా 2014 ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు...టీడీపీ నేత బాల వీరాంజనేయస్వామి చేతిలో జూపూడి ఓటమి పాలయ్యారు. అయితే తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని, తనని కావాలనే ఓడించారని చెప్పి జూపూడి అప్పుడే వైసీపీకి దూరం జరిగారు.


అలాగే టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు..ఇక టీడీపీలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇలా అధికారంలో ఉన్నన్ని రోజులు జూపూడి పొజిషన్ బాగానే ఉంది...కానీ 2019 ఎన్నికల్లో జూపూడికి టీడీపీలో టికెట్ దక్కలేదు...పైగా టీడీపీ అధికారం కోల్పోయింది...దీంతో జూపూడి తన మనసు మార్చుకుని...మళ్ళీ వైసీపీ వైపు చూశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అందులోకి జంప్ చేశారు.
అయితే గతంలో మాదిరిగా జూపూడికి జగన్ ప్రాధాన్యత ఇవ్వలేదు..అలాగే జూపూడి కూడా వైసీపీలో పెద్దగా కనిపించడం లేదు. కాకపోతే ఆ మధ్య సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడిని నియమించారు. ఏదో పదవి వచ్చింది గాని...ఆ పదవి వల్ల జూపూడికి ఎలాంటి ఉపయోగం లేదనే చెప్పాలి. అసలు వైసీపీలో ఏ మాత్రం ప్రాధాన్యత దక్కడం లేదు. మరి వచ్చే ఎన్నికల్లోనైనా ఆయనకు ఏదైనా సీటు ఇస్తారా? లేదా? అనేది తెలియదు. మొత్తానికి జూపూడి పొజిషన్ బాగోలేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: