బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు..

Satvika
మొన్నటివరకూ వర్షాల తో సతమతమైన ప్రజలకు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్.. మళ్ళీ దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తాజా బులిటెన్ లో పేర్కొన్నారు. విషయాన్నికొస్తే.. భారత దేశంలో మళ్ళీ నైరుతి బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ అల్పపీడన ప్రభావం వల్ల రాగల రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు...ఈ వర్ష ప్రభావం తమిళనాడు లో ఎక్కువగా ఉండనుందని తెలుస్తుంది. కాగా, మార్చి 3 నుంచి 5వతేదీల మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.. రాష్ట్రం లోని మిగిలిన ప్రాంతాలలో ఓ మాదిరిగా వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు అధికారులు అంటున్నారు.

ఇది ఇలా ఉండగా.. మార్చి 4,5తేదీల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు అన్నారు.అల్పపీడన ప్రభావం వల్ల గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో రెండు రాష్ట్రాలలో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.ఇక శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర తమిళనాడు-దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరాల మీదుగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అప్రమత్తం చేశారు..మత్స్యకారులు ఈ నెల 5వతేదీ వరకు దక్షిణ బంగాళాఖాతం, దానికి దగ్గిరలొ ఉన్న హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమోరిన్ ప్రాంతాల్లోకి చేపలవేటకు వెళ్ల రాదని అధికారులు విజ్ఞప్తి చెస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: