రేవంత్ రెడ్డి చెప్పింది నిజం కాదు : డీజీపీ

praveen
తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయ నేతగా.. ఎప్పుడు అధికార పార్టీ పై మాటల యుద్ధానికి దిగే రేవంత్ రెడ్డి ఇటీవలే డీజీపీ మహేందర్రెడ్డి ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే డీజీపీ మహేందర్రెడ్డి ని బలవంతంగా సెలవుపై పంపించారు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన డీజీపీ మహేందర్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించింది అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని అదంతా పూర్తిగా అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు.

 ఇటీవలే తాను ఇంట్లో జారి పడటంతో ఎడమ భుజానికి గాయం అయింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే భుజం దగ్గర మూడు చోట్ల ఫ్యాక్చర్ అయిందని ఇక ఎక్స్రే సీటీ స్కాన్ ఎమ్మారై స్కానింగ్ రిపోర్టులో ఈ విషయం తేలింది అంటూ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక దీంతో భుజం కదలకుండా వైద్యులు కట్టు కట్టారు. ఇక ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకు ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉండి విశ్రాంతి తీసుకున్నాను.
 ఇప్పుడు వైద్యుల సూచన మేరకు మళ్లీ విధుల్లో చేరుతున్నా అంటూ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక భుజానికి అవసరమైనవ్యాయామం ఫిజియోథెరపీ మందులను కూడా వాడుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే వాస్తవాలు తెలుసుకోకుండా  ప్రభుత్వ బలవంతంగా సెలవుపై తనను పంపించింది అంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మహేందర్ రెడ్డి. రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేయడం భావ్యం కాదు అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రచారాలు కోసం ప్రభుత్వ అధికారులపైఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం ఖండిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dgp

సంబంధిత వార్తలు: