పవన్ కోసం బాబు: ఆ మూడు స్థానాల్లో డమ్మీలే..!

M N Amaleswara rao
టీడీపీ-జనసేనల పొత్తు ఉంటుందో తెలియదు గాని...పొత్తు పెట్టుకునే దిశగానే చంద్రబాబు మాత్రం వెళుతున్నారు...పొత్తు ప్రకారమే టీడీపీలో సీట్లు కూడా ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారని చెప్పొచ్చు. అంటే పొత్తు ఉంటే కొన్ని సీట్లు జనసేనకు ఇవ్వాల్సి ఉంటుంది...ఇక అలా జనసేనకు ఇవ్వాల్సి వచ్చే సీట్లలో టీడీపీ తరుపున డమ్మీ ఇంచార్జ్‌లని పెడుతున్నారని చెప్పొచ్చు. ఒకవేళ పొత్తు లేకపోతే ఇప్పుడు ఇంచార్జ్‌లుగా ఉన్నవారికే సీట్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది.
అంటే రెండు విధాలుగా బాబు ఇబ్బంది లేకుండా ముందుకెళుతున్నారని చెప్పొచ్చు..ముఖ్యంగా జనసేనకు కాస్త బలం ఉన్న పశ్చిమ గోదావరి లాంటి జిల్లాలో సీట్లు ఫిక్స్ చేసే విషయంలో చంద్రబాబు కాస్త ఆచి తూచి అడుగులేస్తున్నారని చెప్పొచ్చు..ఎందుకంటే ఇక్కడ పూర్తిగా టీడీపీలో అసలైన అభ్యర్ధులని పెట్టడం లేదు. కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్ధులనే పెట్టారని చెప్పొచ్చు.
ఉదాహరణకు జనసేన ప్రభావం కాస్త ఎక్కువగా ఉన్న భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం సీట్లలో టీడీపీలో డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారని చెప్పొచ్చు...ఒకవేళ నెక్స్ట్ పొత్తు ఉంటే మాత్రం ఈ సీటు ఖచ్చితంగా జనసేనకు కేటాయించడం ఖాయం..ఇందులో ఎలాంటి డౌట్ లేదు..ఎందుకంటే గత ఎన్నికల్లో భీమవరం, నరసాపురం సీట్లలో జనసేన రెండో ప్లేస్‌లో నిలవగా, తాడేపల్లిగూడెంలో జనసేనకు ఓట్లు బాగానే పడ్డాయి. కాబట్టి పొత్తు ఉంటే ఈ సీట్లు జనసేనకే దక్కుతాయి. అందుకే జనసేనకు ఇవ్వాలనే కోణంలోనే ఈ మూడు సీట్లలో చంద్రబాబు డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు. భీమవరంలో తోట సీతారామలక్షీ, నరసాపురంలో రామరాజు, తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీని ఇంచార్జ్‌లుగా పెట్టారు.
అంటే పొత్తు ఉండి...ఈ సీట్లు జనసేనకు ఇస్తే వీరు సైడ్ అయిపోతారు...ఎలాంటి అసంతృప్తి కూడా ప్రదర్శించారు. బాబు అంతా ముందు జాగ్రత్తతోనే ఇంచార్జ్‌లని ఖరారు చేశారని చెప్పుకోవచ్చు..పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం బాబు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి చూడాలి చివరికి టీడీపీ-జనసేనల పొత్తు ఉంటుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: