గుడివాడలో జనసేన రూట్ మారుతుందా?

M N Amaleswara rao
ఏపీ రాజకీయాల్లో జనసేనకు పెద్ద బలం లేదనే సంగతి తెలిసిందే..ఆ పార్టీకంటూ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదనే చెప్పాలి...ఆ విషయం గత ఎన్నికల్లోనే రుజువైన విషయం తెలిసిందే..ఆ పార్టీకి కేవలం ఒకే సీటు వచ్చింది...ఇప్పటికీ కూడా ఏపీలో జనసేన బలం పెరగలేదనే చెప్పాలి...అయితే ఇక్కడొక విషయం చెప్పాలి...రాజకీయంగా జనసేన గెలిచే ఛాన్స్ లేదు గాని...గెలుపోటములని తారుమారు చేసే బలం ఉందని చెప్పొచ్చు.
2014 ఎన్నికల్లో కూడా పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయడంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే...ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి పవన్ కల్యాణ్ సెపరేట్‌గా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి...టీడీపీకి బాగా డ్యామేజ్ చేసిన సంగతి కూడా తెలిసిందే...అదే వైసీపీకి అడ్వాంటేజ్ అయింది..అంటే జనసేన వల్ల గెలుపోటములు మారిపోయే అవకాశం ఉంది. అందుకే జనసేనకు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఉందని చెప్పొచ్చు.
అలా జనసేన ప్రభావం ఉన్న స్థానాల్లో గుడివాడ కూడా ఒకటి అని చెప్పొచ్చు...అయితే గుడివాడలో జనసేన ప్రభావం ఎలా ఉంటుందో ఇంతవరకు క్లారిటీ రాలేదు..ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీకి పవన్ సపోర్ట్ ఇచ్చినా సరే..గుడివాడలో కొడాలి నాని గెలుపు ఆగలేదు. అదే సమయంలో 2019 ఎన్నికల్లో జనసేన సెపరేట్‌గా పోటీ చేసింది...కాకపోతే గుడివాడలో మాత్రం జనసేన పోటీ చేయలేదు...పోటీకి దిగిన అభ్యర్ధి అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు..దీంతో కొడాలి నానికి బాగా అడ్వాంటేజ్ అయింది.
ఒకవేళ జనసేన పోటీకి దిగి ఉంటే....కనీసం 15-20 వేల ఓట్ల వరకు తెచ్చుకునేది..ఈ ఓట్లు కొడాలికి పడే ఓట్లే ఎక్కువ..ఎందుకంటే గుడివాడలో ఉన్న కాపు వర్గం నాని వైపే ఎక్కువ ఉంటుంది..అదే సమయంలో జనసేన పోటీ చేసి ఉంటే ఓట్లు చీలిపోయేవి..కొడాలికి డ్యామేజ్ జరిగేది. మరి ఈ సారి ఎన్నికల్లో కాపు ఓటర్లు ఎటు వైపు ఉంటారో చూడాల్సి ఉంది...ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిసి ఉంటే కాపు ఓటర్లు ఎటు ఉంటారు...విడిగా పోటీ చేస్తే ఎటు ఉంటారో చూడాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: