సరికొత్త వ్యూహంతో కేసీఆర్.. అలాంటి వారికే టికెట్లు..!

MOHAN BABU
 ఇద్దరు నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఇంకో వ్యక్తికి మేలు చేయనున్నాయి. వర్గ విభేదాలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో తాటస్తులకే  గులాబీ టికెట్లు దక్కనున్నాయి. అభ్యర్థులను గుర్తించాలని ఇప్పటికే జిల్లా నాయకత్వం లకు తెరాస అగ్రనేతలు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సెగ్మెంట్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఈసారి టికెట్లు  ఆశిస్తున్నారు. ఇతర పార్టీ నుంచి గెలిచిన టిఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఈ టిక్కెట్లను ఆశిస్తున్నారు.అలా ఇద్దరి మధ్య సఖ్యత కుదరక, మూడో వ్యక్తికి టికెట్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది.

 వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని అవలంబించబోతుందని తెలుస్తోంది. గ్రూపులుగా ఏర్పడే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఫార్ములాను అమలు చేయబోతున్నది. ఏ గ్రూప్ కు చెందిన అభ్యర్థి టికెట్ ఇచ్చినా అసంతృప్తితో ఉండే  అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా వ్యూహం రచించినట్టు  తెలుస్తోంది. దీనికి విరుగుడుగా రెండు గ్రూపులు టికెట్లు ఇవ్వకుండా కష్టంగా ఉండేది కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నది. రాష్ట్రంలో దాదాపు పాతిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఈ విషయాన్ని జిల్లా నాయకత్వానికి సూచనప్రాయంగా తెలిపింది. ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ  అభ్యర్థులను వెతకడంపై ఫోకస్ పెట్టింది అని తెలుస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ గ్రూపుల్లో సంఘర్షణ బయటపడ్డ విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సందర్భాల్లో పరిష్కారానికి కూడా చొరవ తీసుకుని ఆశించిన ఫలితం రాలేదు.

దీంతో పోలింగ్ సమయంలో ఎవరికి టికెట్ ఇచ్చినా అసంతృప్తులు  పెరిగి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని ఆందోళన అధినేతకు వెంటాడుతోంది. దీనికి విరుగుడుగా తటస్థంగా ఉన్న వారికే   టికెట్ ఇవ్వాలని ఒక జిల్లా నేత వివరించారు. కాంగ్రెస్ నుంచి 12 మంది తెలుగుదేశం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సెగ్మెంట్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నది. గత సంవత్సరం టిఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఈసారి టికెట్ను ఆశిస్తున్నారు. కానీ ఇతర పార్టీ నుండి గెలిచి టిఆర్ఎస్లో చేరిన సిపిఎం సైతం టికెట్ను ఆశిస్తున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత లేని కారణంగా ఒకరికి టికెట్ ఇస్తే మరోసారి ఆగ్రహం కలిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ పద్ధతి పార్టీకి అనుకూలంగా మారుతుందని అధిష్టానం లెక్కలు వేసింది. దీన్ని నివారించేందుకు తటస్థ ఫార్ములాలు ఎంచుకున్నది. ఈ దిశలోనే వెళ్లాలని తెరాస అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: