టార్గెట్ లోకేశ్ : ఆ వైసీపీ ఎమ్మెల్యే మ‌ళ్లీ రెచ్చి పోయాడ్రా!

RATNA KISHORE
భీమ్లా నాయక్ సినిమా ఫ్లాప్ అని,సినిమా టిక్కెట్లు బ్లాక్ మార్కెట్లో ఉంచి డ‌బ్బులు సంపాదించుకుని, కొంత‌లో కొంతైనా న‌ష్టాల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని చూస్తున్నార‌ని మంత్రి వెల్లంప‌ల్లి చేసిన వ్యాఖ్య‌ల‌కు కొన‌సాగింపుగా మ‌రికొంద‌రు సీన్ లోకి వ‌స్తున్నారు.వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే అదునుగా ప‌వన్ ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు.లోకేశ్ ను కూడా అదేవిధంగా అంటున్నారు.దిగ‌జారిన భాష‌ను ఉప‌యోగించి కొడాలి నాని ఏ విధంగా ఫేమ‌స్ అయ్యారో అదేవిధంగా తామూ అయిపోవాల‌ని విశాఖ ఎమ్మెల్యే ఒక‌రు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.పాల‌న ప‌రంగా ఇవాళ వైసీపీ హ‌యాంలోసాధించిన అభివృద్ధి ఏమీ లేక‌పోయినా ప్ర‌తిపక్షాల‌ను తిట్ట‌డంలో మాత్రం దేశంలోనే ఫ‌స్ట్ ర్యాంకు సాధించిన పార్టీ వైసీపీ మాత్ర‌మేన‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.
ఇప్ప‌టిదాకా టీడీపీ తో వైసీపీ త‌ల‌ప‌డిన వైనం క‌న్నా జ‌న‌సేన‌తో వైసీపీ పెట్టుకుంటున్న త‌గువులే ఎక్కువ‌గా ఉన్నాయి. ఓ రీమేక్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ,తండ్రీకొడుకులిద్ద‌రూ భ‌జ‌న చేస్తూ ఉన్నార‌ని వైసీపీ త‌ప్పుప‌డుతోంది.అంతేకాదు జ‌గ‌న్ క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంద‌ని అందుకు మిలాప్ 2022 వేడుక‌లే కార‌ణం అని చెప్ప‌డంతో టీడీపీ మ‌ళ్లీ ఫైర్ అవుతోంది.ఓ కేంద్ర ప్ర‌భుత్వ వేడుక‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌దిగా చెప్పుకోవ‌డమే హాస్యాస్ప‌ద‌ని అంటోంది.ఈ నేప‌థ్యంలో విశాఖ కేంద్రంగా నిన్న‌టి వేళ మ‌రో వివాదం రేగింది.దీంతో జ‌న‌సేన‌కూ, వైసీపీకీ మ‌ధ్య త‌గువు మ‌రింత పెరిగింది.ఇదే స‌మ‌యంలో ఆ వైసీసీ ఎమ్మెల్యే టీడీపీనీ టార్గెట్ చేసి, లోకేశ్ ను కొన్ని మాట‌లు అన్నారు.దీంతో ఆ ఎమ్మెల్యే వార్త‌ల్లోనిలిచారు.ఇంత‌కూ ఎవ‌రు ఆ ఎమ్మెల్యే? ఏంటి ఆయ‌న క‌థ‌? అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్ లోకేశ్ ను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

ఇప్ప‌టికే సాక్షిపై 75 కోట్ల రూపాయ‌ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసి, అనంత‌రం విశాఖ కోర్టుకు వాయిదాల నిమిత్తం హాజ‌రవు తున్న లోకేశ్ ను ఉద్దేశించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లోకేశ్ అధికారంలో ఉండ‌గా అక్ర‌మంగా సంపాదించి ఇప్పుడు సూక్తులు చెబుతున్నార‌న్నారు.తండ్రీ కొడుకులిద్ద‌రూ క‌లిసి రాష్ట్రాన్ని దోచుకు తిన్నార‌ని ఎద్దేవా చేశారు.ఆయ‌న చిరు తిండి పేరిట ప్ర‌భుత్వ నిధులు కాజేశార‌ని వాటిపైనే సాక్షి క‌థ‌నాలు రాసింద‌ని, కానీ టీడీపీ వీటిని రాద్ధాంతం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్ ఎదుగుద‌ల ఓర్వ‌లేకే ప‌రువు న‌ష్టం కేసుల పేరిట విశాఖకు వ‌చ్చి నానా యాగీ చేస్తున్నార‌ని  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: