ప్రకాశంలో సైకిల్ సీట్లు ఫిక్స్?

M N Amaleswara rao
తెలుగుదేశం పార్టీలో సీట్లు ఫిక్స్ అయిపోతున్నాయి..ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు పైనే సమయం ఉండగానే..టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికక్కడ అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు..ఇప్పటినుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళితేనే...నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వగలుగుతామనే ప్లాన్‌లో చంద్రబాబు ఉన్నారు..ఏదో ఎప్పటిలాగా ఎన్నికల ముందు అభ్యర్ధులని ఫిక్స్ చేస్తే దెబ్బతింటామనేది బాబుకు బాగా అర్ధమవుతుంది...అందుకే ఇప్పటినుంచే నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతల పనితీరుని సమీక్షిస్తూ...పనితీరు బాగున్న వారికి సీట్లు ఫిక్స్ చేస్తూ వస్తున్నారు..అలాగే పనితీరు బాగోని వారిని పక్కన పెట్టేసే ఆ ప్లేస్‌లో కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నారు.
అలాగే కొద్దో గొప్పో బాగున్న వారికి ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు...ఇలా బాబు సరికొత్తగా రాజకీయం చేస్తూ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో చాలావరకు సీట్లు ఫిక్స్ చేసినట్లు కనిపిస్తున్నారు...గత ఎన్నికల్లో ప్రకాశంలో టీడీపీ కొద్దో గొప్పో మంచి ఫలితాలే రాబట్టిందని చెప్పొచ్చు..జిల్లాలో ఉన్న 12 సీట్లలో టీడీపీ 4 గెలుచుకుంది..ఇక వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి ప్రకాశంలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలనే దిశగా బాబు ప్లాన్ చేశారు..అందుకే ముందుగానే సీట్లు ఖరారు చేసేస్తున్నారు.


మొదట సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు ఫిక్స్ చేసేశారు..అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, కొండపిలో బాల వీరాంజనేయస్వామి పోటీ చేయడం గ్యారెంటీ. గత ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసి గెలిచిన కరణం బలరాం వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే...దీంతో చీరాల ఇంచార్జ్‌గా యడం బాలాజీని పెట్టారు. అయితే ఈయనకు ఇంకా సీటు ఖరారు చేయలేదు.
అటు ఒంగోలులో దామచర్ల జనార్ధన్, కనిగిరిలో ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి, సంతనూతలపాడులో బి‌ఎన్ విజయ్ కుమార్, గిద్దలూరులో అశోక్ రెడ్డి, దర్శిలో పమిడి రమేష్ పోటీ చేయడం ఖాయమే. ఇక మార్కాపురం, కందుకూరు, ఎర్రగొండపాలెం సీట్లు విషయంలో కాస్త క్లారిటీ రావాల్సి ఉంది...మొత్తానికైతే చాలావరకు సైకిల్ సీట్లు ఫిక్స్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: