గన్నవరంలో కమ్మ అభ్యర్ధి?

M N Amaleswara rao
తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న గన్నవరంలో కమ్మ అభ్యర్ధిని పెట్టాలనే డిమాండ్ ఎక్కువ వస్తుంది..ఇక్కడ కమ్మ అభ్యర్ధిని నిలబెడితేనే వల్లభనేని వంశీకి చెక్ పెట్టడానికి కుదురుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి..ఒకవేళ ఇప్పుడు ఇంచార్జ్‌గా ఉన్న బచ్చుల అర్జునుడుని కంటిన్యూ చేస్తే గన్నవరం సీటు మరిచిపోవచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. అర్జునుడు మంచి నాయకుడే గాని..వంశీకి పోటీ ఇచ్చే బలం ఆయనకు లేదని అంటున్నారు. కాబట్టి త్వరగా గన్నవరం అభ్యర్ధిని తేల్చాలని తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
అయితే తమ్ముళ్ళు డిమాండ్ చేసేదే కరెక్ట్ అని చెప్పొచ్చు..ఎందుకంటే గన్నవరంలో కమ్మ సామాజికవర్గ ప్రభావం ఎక్కువ...మొదట నుంచి టీడీపీలో ఇక్కడ కమ్మ నేతలే పోటీ చేస్తూ విజయాలు సాధిస్తూ వస్తున్నారు..ఇక అదే కమ్మ వర్గానికి చెందిన వల్లభనేని వంశీ..2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన విషయం తెలిసిందే...కాకపోతే వైసీపీ అధికారంలోకి రావడం..పైగా తన స్నేహితుడు కొడాలి నాని మంత్రిగా ఉండటంతో..వంశీ టీడీపీని వదిలి..వైసీపీ వైపుకు వెళ్లారు.
ఇక వచ్చే ఎన్నికల్లో వంశీ గన్నవరంలో వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయం..పైగా టీడీపీ నుంచి వెళుతూ...బలమైన క్యాడర్‌ని కూడా తన వెంట తీసుకెళ్లారు..దీంతో గన్నవరంలో టీడీపీ బలం చాలావరకు తగ్గింది..వంశీ వైసీపీ వైపు వెళ్ళాక టీడీపీ ఇంచార్జ్‌గా అర్జునుడుని పెట్టారు గాని..ఆయన వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే చెప్పాలి.
ఏదో పేరుకే ఇంచార్జ్‌గా ఉన్నారు గాని..గన్నవరంలో పార్టీని బలోపేతం చేయడంలో, వంశీకి చెక్ పెట్టడంలో అర్జునుడు బలం సరిపోదు..అందుకే ఈ సీటు బలమైన కమ్మ నేతకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు..వరుసపెట్టి అసెంబ్లీ స్థానాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ..అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే పనితీరు బాగోని వారిని పక్కన పెట్టి, వారి ప్లేస్‌లో కొత్తవారిని తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ క్రమంలోనే గన్నవరంలో అర్జునుడుని తప్పించి..కమ్మ నేతకు బాధ్యతలు ఇవ్వాలని తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు...మరి గన్నవరంలో కమ్మ అభ్యర్ధిని పెడతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: