నారాయణఖేడ్ కు సీఎం కేసీఆర్.. ఎందుకో తెలుసా..!

MOHAN BABU
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను సీఎం కేసీఆర్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జుజాలు పూర్ లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మంత్రి హరీష్ రావు ఆదివారం సభ ప్రాంగణాన్ని పరిశీలించి 3.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సందర్శించనున్నారని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కాలేశ్వరంతో అనుసంధానం చేయనున్నారు. వీటి  నిర్మాణానికి ప్రభుత్వం 4,427 కోట్లు ఖర్చు చేయనుంది. జహీరాబాద్, నారాయణఖేడ్ ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

29.9 టీఎంసీల సామర్థ్యంతో కూలిన సింగూరు ప్రాజెక్టుకు కాలేశ్వరంతో అనుసంధానం చేస్తారు. కాలేశ్వరం నుంచి సింగ్ కు వచ్చిన నీటిని లిఫ్ట్ ద్వారా పంట పొలాలకు అందించనున్నారు. సంగమేశ్వర ప్రాజెక్టుకు 2653 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గంలోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగు నీరు అందనుంది. మూడు పంపు లతో  147 మీటర్ల ఎత్తున నీటిని లిఫ్ట్ చేస్తారు. మొత్తం 215 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. బసవేశ్వర పథకాన్ని 1774 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. బసవేశ్వర పథకంతో నారాయణఖేడ్ నియోజకవర్గంలో 8 మండలాలలో 166 గ్రామాలకు నీరు అందించనున్నారు. 1.71 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు పంపుల ద్వారా 74.52 మీటర్ల మేర నీటిని లిఫ్ట్ చేసి మొత్తం 120 కిలో మీటర్లు పైపుల కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించారన్నారు.

 సీఎం కేసీఆర్ పాల్గొనే సభకు లక్ష మంది వచ్చేలా ఏర్పాట్లు చేశారు. జహీరాబాద్, సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం గ్రామాల నుంచి బస్సులు డీసీఎం వాహనాల ద్వారా జనాన్ని తరలించేందుకు నాయకులు ఏర్పాటు చేశారు. ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యేలు మాణిక్రావ్ చంటి క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: