కొడాలిని మళ్ళీ కెలుకుతున్నారుగా?

M N Amaleswara rao
మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు...ఫైర్ బ్రాండ్ నాయకుడుగా ముద్రవేసుకున్న...కొడాలి విమర్శలు ఎలా ఉంటాయో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...అయితే కొడాలి విమర్శలు చేస్తారని చెప్పడం కంటే..బూతులు తిడతారు అని చెప్పొచ్చు...ఇక ఎలాంటి బూతులో రెండున్నర ఏళ్లుగా ఏపీ ప్రజలు వింటూనే ఉన్నారు..చంద్రబాబుని, ఆయన తనయుడు లోకేష్‌లపై కొడాలి తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు.
అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే..నాని ఇంతవరకు మీడియా ముందుకొచ్చి తన శాఖకు సంబంధించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు గాని..చంద్రబాబుని తిట్టిన సందర్భాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి..అందుకే జనాలకు కూడా కొడాలి ఏ శాఖ నిర్వర్తిస్తున్నారో కూడా పెద్దగా తెలియదనే చెప్పాలి. కొడాలి అంటే చంద్రబాబుని తిట్టడానికే ఉన్నారని జనం అనుకుంటారు. అందుకే కొడాలిని బూతుల మంత్రి అని టీడీపీ శ్రేణులు విమర్శిస్తుంటాయి.
అలాగే కొడాలి బూతులకు టీడీపీ నేతలు కూడా అదే బూతుల్లో కౌంటర్లు ఇస్తుంటారు. కాకపోతే ఇటీవల టీడీపీ, కొడాలి నాని మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇక నుంచి బూతులు తిట్టుకోకూడదని ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్టే కొడాలి మీడియాలో మాట్లాడితే...కాస్త బాబుని తిట్టడం తగ్గించారు. కాకపోతే విమర్శలు మాత్రం ఆపలేదు. కానీ గతంలో కంటే ఇప్పుడు బూతులు తిట్టడం తగ్గించారనే చెప్పొచ్చు. ఇలా బూతులు తగ్గించిన కొడాలిని టీడీపీ నేతలు బూతులు తిట్టడం మొదలుపెట్టారు.
తాజాగా టీడీపీ నేతలు దేవినేని ఉమా, బోండా ఉమాలు కొడాలిని దారుణంగా తిట్టారు...అసలు పరుష పదజాలంతో కొడాలిని దూషించారు. అంటే కొడాలి చేసే విమర్శలకు మామూలుగా కౌంటర్లు ఇస్తే సరిపోయేది...కానీ ఆ ఇద్దరు నేతలు బూతులతో రెచ్చిపోయారు..పిచ్చి పిచ్చిగా కొడాలిని తిట్టేశారు. అయితే ఇలా తిట్టడంతో మళ్ళీ కొడాలిని కెలికినట్లు అయింది...మరి కొడాలి మళ్ళీ బూతులు అందుకునే అవకాశం కూడా ఉంది. అంటే కొడాలి బూతులు తిట్టాలనే టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తున్నారు. మరి చూడాలి కొడాలి నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ వస్తుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: