3 రాజధానులపై తగ్గేదేలే అంటున్న మంత్రి కొడాలి నాని..

VAMSI
ప్రస్తుతం ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితిని చూస్తే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయి హైదరాబాద్ ను కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు మనకు రాజధాని ఏది అనేది చెప్పుకోవడానికి మాత్రం అధికారికంగా అమరావతి అంటున్నారు. కానీ ఎంత వరకు అమరావతి రాజధానిగా సూట్ అవుతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకోసం కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అనే కొత్త అంశాన్ని ఒక బిల్లు రూపంలో తీసుకు వచ్చింది. ఇందుకు ఒక రాజధాని కాకుండా రాష్ట్రానికి మొత్తం మూడు రాజధానులు ఉండేలా ప్లాన్ చేశారు.
అయితే మన ఏపీలో ఎలా ఉందంటే .. అధికార ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే బిల్లులు తీసుకు వచ్చినా ప్రతిపక్షం మరియు ఇతర వ్యతిరేక పార్టీలు ఆ బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అయితే ఈ బిల్లును అమలు చేయడానికి వీలు లేదని టీడీపీ మరియు ఇతరులు కొందరు హై కోర్ట్ లో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే కొంత కాలం ఈ అంశం అలా మరుగున పడిపోయి, కొత్త సమస్యలు వచ్చి వాటితో కుస్తీ పడుతున్నారు. అయితే తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన నాని ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ గురించి మాట్లాడుతూ మూడు రాజధానుల విషయం గురించి మరోసారి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియచేశారు.
ఎలాగైనా మూడు రాజధానుల ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఘంటాపథంగా తెలిపారు. ఇదే మూడు రాజధానుల విషయం గురించి వచ్చే బడ్జెట్ లో సరికొత్త బిల్లును పెడతామని తమ ప్రణాలికను తెలియచేశారు. అయితే టీడీపీ ఏ విధంగా ఈ విషయంలో స్పందిస్తుంది అనేది తెలియాలంటే బడ్జెట్ పెట్టే వరకు వెయిట్ చేయాల్సిందే. మనకు తెలిసి యధావిధిగా మళ్లీ కేసులు వేయడం జరుగుతుంది. అయితే ఇది ఇంకా ఎన్నెన్నో సమస్యలకు కారణం కానుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: