అధికార పార్టీలో పదవుల టెన్షన్?

Purushottham Vinay
ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీలో ఇప్పుడు పదవుల టెన్షన్ నెలకొంది. తొందర్లోనే రాజ్యసభ ఎన్నికలు అనేవి జరగనున్నాయి. ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలు కూడా అధికార వైసీపీ పార్టీ ఖాతాలోనే పడనున్నాయి.ఇక ఈ నాలుగు స్థానాల కోసం అధికార పార్టీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ అనేది జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి మరోసారి పదవి అనేది రెన్యువల్ అవుతుందా ? లేదా ? అన్నది కూడా కాస్త సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంది. ఇందుకు పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు అనేవి నడుస్తున్నాయి. ఒకవేళ విజయసాయిరెడ్డికి కనుక ఎంపీ రాజ్యసభ ఎక్స్టెన్షన్ లేకపోతే ఆయన్ను ముఖ్యమంత్రి జగన్ త్వరలో జరిగే కేబినెట్ మార్పుల్లో మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా ఆర్థికమంత్రి పదవి ఇస్తారని కూడా అంటున్నారు.విజయసాయి రెడ్డి రాజ్యసభ రెన్యువల్ చేయకపోతే త్వరలో మంత్రి వర్గ విస్తరణలో ఆర్థికశాఖా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అనేది జరుగుతోంది.
ఏపీని ఆర్థికంగా అన్ని విధాలా ముందుకు నడిపించాలంటే ఆర్థికవేత్త అయిన ఆయనే సమర్థుడు అని కూడా జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. విజయసాయి రెడ్డికి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు అనేది ఉంది. జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టకముందు నుంచే వైఎస్ కుటుంబం జగన్ ఆర్థిక వ్యవహారాలు అన్నింటిని అప్పుడు ఆయనే చూసుకునేవారు.ఇక జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక ఆయన రాజకీయంగా కూడా ఆరితేరిపోయారు. ఇక ఢిల్లీలో ఆయనకు మంచి పలుకుబడి కూడా ఉంది. ఎన్డీయే పెద్దలతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ఆరేళ్లుగా ఆయన ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డికి కావాల్సిన వ్యక్తి. బీజేపీ ప్రభుత్వం నుంచి ఫండింగ్ తీసుకురావడంలో ఆయన వ్యూహాలు పనిచేస్తాయని జగన్ మోహన్ రెడ్డి నమ్ముతున్నారు.
రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కాని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టే విషయంలో అంత చురుకుగా ఉండడం లేదన్న భావనకు జగన్ మోహన్ రెడ్డి వచ్చేశారట. అందుకే మంత్రి వర్గంలో మార్పులు చేర్పుల్లో బుగ్గనను పక్కన పెట్టేస్తారనే తెలుస్తుంది. అదే కనుక జరిగితే ఈ సారి బుగ్గన ప్లేస్లో విజయసాయి రెడ్డిని ఆర్థికమంత్రిగా చూడొచ్చన్న టాక్ వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: