వారెవ్వా.. ఆ ఆయుధం తయారవుతుంది?

praveen
రోజు రోజుకి టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం తుపాకులతో యుద్ధం చేసిన వారు ఇప్పుడు అధునాతనమైన ఆయుధాలను ఉపయోగిస్తూ శత్రువులపై దాడి చేయడానికి సిద్ధమైపోతున్నారు. అదే సమయంలో అటు ఆయుధ వ్యవస్థలో కూడా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అయితే కేవలం మిస్సైల్స్  ద్వారా మాత్రమే దాడి చేసేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అతి చిన్న ఆయుధాలతోనే ఏకంగా విధ్వంసం సృష్టించేందుకు టెక్నాలజీ పెరిగిపోయింది. అయితే ఇప్పటికే ఎన్నో దేశాల్లో ఇలా ఆధునాతన  టెక్నాలజీతో కూడిన ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి.. కానీ భారత్ ఆర్మీ  ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది.

 అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను తయారు చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒకవైపు భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ ఆయుధాలను  అభివృద్ధి చేస్తూ ఉండగా.. మరోవైపు విదేశీ ఆయుధ తయారీ  సంస్థలను భారత్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇలా విదేశీ సంస్థలతో కలిసి  ఆయుధాలను తయారు చేయడంలో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నో అధునాతన ఆయుధాలు తయారు చేశగా.. ఇప్పుడు మరో విధ్వంసకర  ఆయుధాన్ని భారత్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

 ఎటువంటి ఆయుదాన్నైనా భీకర స్థాయిలో ధ్వంసం చేయగలిగినటువంటి మెగా యాంటి ఆర్మర్ వెపన్ సిస్టం ప్రస్తుతం భారత్ లో అభివృద్ధి అవుతున్నాయట.  యుద్ధ ట్యాంకులు తో పాటు ఆర్మీ కన్స్ట్రక్షన్స్, ఆర్మీ బేస్ లను  కూడా ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించే సామర్థ్యాన్ని  ఈ ఆయుధం కలిగి ఉంటుందట.  ఒక సైనికుడు భుజాలపై నుంచి ఎంతో సులభంగా ఈ ఆయుధాన్ని ప్రయోగించేందుకు అవకాశం ఉంటుందట. స్వీడన్ కు సంబంధించిన ఆయుధ తయారీ కంపెనీ మేకిన్ ఇండియా లో ఈ ఆయుధాన్ని భారత్లో తయారు చేస్తూ ఉండటం గమనార్హం. మరి కొన్ని రోజుల్లో ఈ అధునాతనమైన ఆయుధం భారత ఆర్మీ చేతుల్లోకి రాబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: