ఆకలి రాజ్యం.. సంపన్న భారతం.. ఏం జరుగుతోంది..!

MOHAN BABU
కరోనా సమయంలో కూడా భారతదేశంలో అపర కుబేరుల సంపద పెరుగుతూనే ఉంది. పేదలు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. కరోనా మహమ్మారి  కారణంగా ఈ రెండేళ్లలో మరో 16 కోట్ల మంది పైగా దుర్భర దారిద్ర్యంలో కూరుకుపోయారని పేదరిక నిర్మూలనకు పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్ ఫామ్ అధ్యయనం లో వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సదస్సు సందర్భంగా ఆక్స్ ఫామ్ సంస్థ ఆర్థిక అసమానతల పై నివేదిక `ఇన్ ఈక్వలిటీ కిల్స్ ´ పేరుతో విడుదల చేసింది. కరోనా బిలియనర్లకు అధిక లాభాలు పండించింది.

భారత్ లో ధనవంతులను మరింత ధనవంతులు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఈ మధ్య తీసుకువచ్చిన నూతన ఆర్థిక విధానాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా ఉన్నాయి. వీటి భారమంతా సామాన్యుల పైన పడుతుంది. దీని కారణంగా నిరుపేదలు పేదరికంలో చితికి పోతున్నారు. దేశంలో రెండే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి దళితులు, రెండు పేదవారు. ఇప్పటికైనా ధనవంతుల సంపద వెనక్కి తీసుకురావడానికి సంపన్నులపై అధిక పన్నులు వసూలు చేయాలని అలా వచ్చిన ఆదాయం ద్వారా ఎంతో మంది పేదల అభ్యున్నతి కోసం ఉపయోగించవచ్చునని ఇంటర్నేషనల్ ఆక్స్ ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రీయెలాబచర్  అభిప్రాయపడ్డారు.బిలియనర్లు జెఫ్ బెజోస్,  ఎలన్ మాస్క్, బిల్ గేట్స్ సహా ప్రపంచంలోని టాప్ టెన్ జాబితాలో ఉన్న వారు ఒక రోజు సంపాదన దాదాపు 130 కోట్ల డాలర్లు. ప్రపంచంలోని నిరుపేదలైన 310 కోట్ల మంది కంటే ఈ 10 మంది ఆరు రెట్లు అధిక సంపన్నులు. ఆర్థిక అసమానతల కారణంగా రోజుకు ప్రపంచ వ్యాప్తంగా సగటున 21 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా మన దేశంలో ఎంతోమంది పూటకు లేని వారు ఉన్నారు. కరోనాతో కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదల ఆదాయం 84 శాతం తగ్గింది. దేశంలోని వందమంది ధనవంతుల మొత్తం సంపద రికార్డు స్థాయిలో57.3 లక్షల కోట్లకు చేరుకుంది. దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, ప్రభుత్వాలు మారినా నిజమైన అర్హులకు న్యాయం జరగడం లేదు. నేటికీ రోడ్లపై భిక్షాటన చేస్తూ ప్రాణాలు వదులుతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు.

 టాప్ టెన్ ధనవంతులు రోజుకు 7.42 కోట్లు ఖర్చు పెట్టిన వారి వద్ద ఉన్న ఆస్తి మొత్తం కరిగి పోవడానికి 84 ఏళ్లు పడుతుంది. విస్తీర్ణం, జనాభా పరంగా పెద్ద దేశాలలో ఇండియా ఒకటి. ఖనిజసంపద, సహజ వనరులు అధికంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకు పోవచ్చు.కానీ దేశ సంపదను పారిశ్రామికవేత్తలు, సంపన్నులు దోచుకొని దాచుకొని దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: