ఆ స్కూల్స్ ను క్లోజ్ చేస్తామన్న ఏపీ మంత్రి...

VAMSI
కరోనా గురించి తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇంతకు మునుపు ఎన్నడూ కూడా ఒక వైరస్ గురించి ఇంత భయపడిన సందర్భం లేదనే చెప్పాలి. ఏ ముహూర్తాన మన దేశంలోకి చొరబడిందో తెలియదు కానీ ప్రజలు అందరినీ వణికిస్తోంది. ఈ కరోనా వలన రోజు వారీ కూలీ నుండి పెద్ద కంపెనీలలో లక్షలు సంపాదించే ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. 2020 నుండి ఈ రోజు వరకు ఎన్నో కంపెనీలు ఆఫీస్ లకు ఉద్యోగులను అనుమతించకుండా ఇంటి నుండి మాత్రమే పని చేసే సౌలభ్యాన్ని కలిగించింది. ఇంకా కొన్ని కంపెనీలు ఎందరో ఉద్యోగులను తీసి వేశారు. ఇలా చాలా రకాలుగా మానవ జాతి ఇబ్బందులను ఎదుర్కొంది.
ఈ మహమ్మారి మూలంగా విద్యావ్యవస్థ సైతం కుంటు పడింది. గత సంవత్సరం 10 మరియు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు లేకుండా చేసి ఒక తరం విద్యార్థులను ఈ ప్రపంచం కోల్పోయేలా చేసింది. అందరినీ పాస్ చేసేయడంతో విద్యార్థి లోకం మూగబోయింది. ఇప్పుడు ఒక నెల రోజుల నుండి ఏపీలో కేసులు వస్తున్నాయి. దీనితో మళ్లీ భయం మొదలైంది. ఈ కారణంగా మళ్లీ స్కూల్ మరియు కాలేజ్ ల నిర్వహణ పట్ల ప్రజలు మరియు మీడియా ఛానెళ్లు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఏపీలో అన్ని స్కూల్స్ యదావిధిగా ఓపెన్ అయ్యాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూల్స్ లో టీచర్స్ కు మరియు విద్యార్థులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సరైన సమాధానం ఇచ్చారు. ఈయన మాట్లాడుతూ స్కూల్స్ లో టీచర్ లకు ఎవరికైనా కరోనా సోకితే వెంటనే వారికి సెలవులు ఇస్తాము. అదే విధంగా విద్యార్థులకు కరోనా సోకితే కేవలం ఆ ఒక్క స్కూల్ ను మాత్రమే క్లోజ్ చేసి మిగిలిన అన్ని స్కూల్స్ యదావిధిగా కొనసాగిస్తాము అని క్లారిటీ ఇచ్చారు. దీని గురించి పిల్లల తల్లితండ్రులు బాధపడే అవసరం లేదని భరోసా ఇచ్చారు. అంతే కాకుండా  స్కూల్స్ ను శానిటైజ్ చేస్తూ అన్ని రక్షణ పరమైన చర్యలను తీసుకుంటున్నట్లు ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనితో స్కూల్స్ మూతపడుతాయి అని కొన్ని రోజులుగా మీడియా చేస్తున్న హంగామాకు తెరపడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: