కేసీఆర్ టాక్స్ : తెలంగాణ‌లో మినీ లాక్డౌన్ ?

RATNA KISHORE
- ఫిబ్ర‌వ‌రి నుంచి ఆన్లైన్ త‌ర‌గ‌తులు
- మినీ లాక్డౌన్ పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు
- మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌తో మంత‌నాలు
- సుదీర్ఘ చ‌ర్చ త‌రువాత నిర్ణ‌యాలు
- కేసీఆర్ నేతృత్వంలో క్యాబినెట్ భేటీ

సంక్రాంతి త‌రువా క‌రోనా నియంత్ర‌ణ‌కు సంబంధించి కొన్ని కీలక నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతో పాటు నిషేధాజ్ఞ‌లు కూడా విధించేందుకు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు యోచిస్తున్నాయి.ఇప్ప‌టికే ఆంధ్రాలో ఈ నెల 18 త‌రువాత నైట్ క‌ర్ఫ్యూ విధించేందుకు  సీఎం జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.ఇదే కోవ‌లో తెలంగాణ‌లోనూ కొన్ని నిషేధాజ్ఞ‌లు కొన్నిముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు కేసీఆర్ స‌న్న‌ద్ధం అవుతున్నారు. వీటితో పాటు వ్యాక్సినేష‌న్ ప్రాసెస్ ను కూడా వేగ‌వంతం చేయ‌నున్నారు. ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌లో కొద్ది పాటి మార్పులు చేసి క‌రోనా ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు వీలుగా రోగుల‌కు మంచి వైద్య సౌక‌ర్యం అందించేందుకు వీలుగా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు చ‌ర్య‌లు చేప‌డుతున్న సంగ‌తి విధిత‌మే!

క‌రోనా ఉద్ధృతి నేప‌థ్యంలో తెలంగాణ‌లో మినీ లాక్డౌన్ విధించే అవ‌కాశాలున్నాయి.ఈ నేప‌థ్యంలో కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు చేసేందుకు కేసీఆర్ అండ్ కో ఆలోచిస్తోంది.దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించేందుకు ఆస్కారం లేద‌ని కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేయ‌డంతో రాష్ట్రాల‌కు సంబంధించి కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఆ మేర‌కు తెలంగాణ‌లో రాత్రి పూట క‌ర్ఫ్యూకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. అదేవిధంగా గుంపులు గుంపులుగా గుమిగూడే సామూహిక ఉత్సవాల‌కు,జాత‌ర‌ల‌కు నిషేధం విధించాల‌ని భావిస్తున్నారు. అదేవిధంగా రాత్రి పూట క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప‌బ్బులూ క్ల‌బ్బుల‌పై నిషేధాజ్ఞ‌లు జారీ కానున్నాయి.అదేవిధంగా ప‌లు ర్యాలీల‌కు కూడా ఆంక్ష‌లు ఉండ‌నున్నాయి. వీటిని కూడా కొద్ది కాలం పాటు నిషేధించేందుకు ఆస్కారం ఉంది. ఇప్ప‌టికే బ‌డుల‌కు ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ తెలంగాణ స‌ర్కారు సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి విధిత‌మే! పూర్తి స్థాయిలో చ‌ర్చించాకనే క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌తో మాట్లాడాక‌నే కేసీఆర్ త‌న నిర్ణ‌యం వెలువ‌రించ‌నున్నారు అని అధికారిక వ‌ర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: