వావ్ వావ్ : హైద్రాబాద్ రోడ్ల‌పై కేటీఆర్ ఫార్ములా?

RATNA KISHORE
కారులో షికారుకు పోవ‌డం ఓ సులువు ప‌ని..రేసింగుల‌కు పోవ‌డం ఓ సాహ‌సి ప‌ని.అయితే అన్ని రోజుల్లోనూ రేసింగులు కుద‌ర‌క‌పోవ‌చ్చు.అన్ని రోడ్లూ అందుకు అనుకూలం కావు. ఇ - వ‌న్ ఫార్ములా రేసింగ్ అంటే కేవ‌లం ఎల‌క్ట్రిక‌ల్ కార్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం.వీటి సాయంతో మీరు రేసులో పాల్గొన‌వ‌చ్చు.విజేత‌గా నిలిచి ఆనందించ‌నూవ‌చ్చు.త్వ‌ర‌లోనే విశ్వ‌న‌గ‌రి భాగ్య‌న‌గ‌రిలో సంబంధిత పోటీల‌కు ఆహ్వానం ప‌లుకుతోంది టీ స‌ర్కార్..ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు కేటీఆర్.విశ్వ‌న‌గ‌రి ఖ్యాతిని విస్తృతం చేసేందుకే తామీ త‌ర‌హా ప్రణాళిక‌లు ఎంచుకుంటున్నామ‌ని అంటోంది టీ స‌ర్కారు.
గ‌జిబిజి న‌గ‌రం అని హైద్రాబాద్ ను అంటారు.ఉండేందుకు వీలుంటే మంచి న‌గ‌రం ఇదే అని కూడా అంటారు.యూర‌ప్,అమెరికా సైతం క‌న్నేసే మ‌నపై నిత్యం..ఈ సైబ‌ర‌బాదుల క‌ష్టం పెంచునులే ఆంధ్రా ఇంకం అని అప్పుడెప్పుడో విశ్వ అని ఓ రైట‌ర్ రాశారు. అది ఆంధ్రా,తెలంగాణ విడిపోక ముందు.విడిపోయినా, క‌లిసి ఉన్నా మ‌నుషులంతా ఒక్క‌టే క‌నుక మ‌నం హైద్రాబాద్ అనే విశ్వ‌న‌గ‌రికి కొత్త ఖ్యాతి వస్తుందంటే త‌ప్ప‌కుండా ఆనందించాలి.ఆ కోవ‌లో ఆ తోవ‌లో ఎవ్వరున్నా కూడా పిలిచి అభినందించాలి.కేటీఆర్ చొరవ కార‌ణంగా త్వ‌ర‌లోనే ఇ-వ‌న్ ఫార్ములా రేసింగ్ లు ప్రారంభం కానున్నాయి.జోరుగా కార్లు న‌డిపే హీరోలు త‌మ తమ ప్లానింగ్స్ అన్నీ ఇప్పుడే మొద‌లుపెట్టండి.ఇవి కేవలం పోటీల వ‌ర‌కూ మాత్ర‌మే ప‌రిమితం చేయండి.మీ జోరు ర‌ద్దీ రోడ్ల మీద కాద‌ని గుర్తుపెట్టుకోండి.
పెద్ద పెద్ద న‌గ‌రాలు వాటికి అనుస‌రించి ఉండే సౌక‌ర్యాలు అన్న‌వి ప్రపంచ చ‌రిత్ర‌లో ఓ పెద్ద అధ్యాయం.ఆ అధ్యాయాన్ని చ‌ద‌వాల‌న్నా,చ‌దివి పాటించాల‌న్నా క‌ష్ట‌మే! కానీ ఇప్పుడు అలాంటి ప‌రిణామాల‌కు తార్కాణంగా నిల‌వ‌నుంది తారక రాముడి ఆలోచ‌న.హైద్రాబాద్ రోడ్ల‌పై ఎల‌క్ట్రిక్ కార్ల‌తో ఫార్ములా ఒన్ రేసులు నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.యువ రాజు ఆలోచ‌న ప్ర‌కారం సంబంధిత కంపెనీల‌తో ఒప్పందాల‌ను కూడా చేసుకున్నారు.అన్నీకుదిరితే త్వ‌ర‌లోనే ఇవి మొద‌లుకానున్నాయి.ఇ-వ‌న్ ఫార్ములా పేరుతో పిలిచే ఈ రేసుల నిర్వ‌హ‌ణ‌కు హైద్రాబాద్ న‌గ‌రితో పాటు మ‌రికొన్ని న‌గ‌రాలు పోటీ ప‌డిన‌ప్ప‌టికీ కేటీఆర్ చొర‌వ కార‌ణంగానే ఆ అవ‌కాశం తెలంగాణ ను వ‌రించింద‌ని ప్రభుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.ముంబ‌యి,ఢిల్లీ,బెంగ‌ళూరు వంటి న‌గ‌రాలు చొరవ చూపిన‌ప్ప‌టికీ ఇ-వ‌న్ ఫార్ములా రేసుల‌కు హైద్రాబాద్ న‌గ‌ర‌మే తుది పోరులో నిలిచి గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: