కమలం వెరైటీ స్ట్రాటజీ..వర్కౌట్ అవుతుందా?

M N Amaleswara rao
రాజకీయంగా ఏ పార్టీ అయిన ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టడానికి అనేక వ్యూహాలు పన్నుతూ ఉంటాయి. అలాగే సొంత పార్టీని బలోపేతం చేయడానికి పలు రకాల స్ట్రాటజీలని వర్కౌట్ చేశారు. అలా పార్టీ బలోపేతమైతే...అపోజిషన్ పార్టీకి కాస్త గట్టి పోటీ ఇవ్వొచ్చు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కూడా అదే దిశగా పనిచేస్తుంది. ఓ వైపు ప్రత్యర్ధిగా ఉన్న టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో అనేక స్ట్రాటజీలని బీజేపీ తెరపైకి తీసుకొస్తుంది. సరే రాజకీయంగా అనేక వ్యూహాలు ఉంటాయి. కానీ కమలం పార్టీ వెరైటీగా ఒక స్ట్రాటజీని తెరపైకి తీసుకొచ్చింది. ఎక్కడైనా పార్టీలో వివిధ శాఖలు ఉంటాయి.. ప్రధానంగా పార్టీ అధ్యక్షుడుతో పాటు..పలు రకాలుగా పార్టీ పదవులు ఉంటాయి. అలాగే కులాల వారీగా పార్టీ శాఖలు ఉంటాయి. ఇక జిల్లా అధ్యక్షుడు నుంచి..గ్రామ స్థాయి లీడర్ వరకు పలు పదవులు ఉంటాయి. వారంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కూడా కింది స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం కోసం గట్టిగానే ట్రై చేస్తుంది.
ఇదే క్రమంలో రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా వెరైటీగా ఇతర పార్టీ నేతలని చేర్చుకోవడం కోసం ఒక శాఖని పెట్టింది. పైగా దానికి చేరికల కమిటీ అని పెట్టి,  ఆ కమిటీకి ఛైర్మన్‌ని కూడా పెట్టింది. సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డిని ఛైర్మన్‌గా పెట్టింది. అంటే చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి పని ఒక్కటే...ఇతర పార్టీల్లో ఉన్న బలమైన క్యాడర్‌ని, నాయకులని పార్టీలోకి తీసుకురావడం. అసలు ఏ నాయకుడు బలంగా ఉన్నారు..ఆ నాయకుడుని పార్టీలోకి ఎలా తీసుకోవాలి...అలాగే పార్టీలోకి వస్తానని చెప్పే నాయకులని తీసుకోవాలా వద్దా? అనే అంశాలని పరిశీలించి...పార్టీలోకి బలమైన నాయకులని తీసుకోవడమే...ఈ చేరికల కమిటీ పని. మరి ఈ వెరైటీ స్ట్రాటజీతో కమలం పార్టీ కారు పార్టీకి చెక్ పెడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: