అంతా అబద్ధం..పెరిగిన నిరుద్యోగం తగ్గిందంటూ ప్రచారం.. ఎక్కడంటే..!

MOHAN BABU
ఎన్నికలకు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి రంగంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కానీ అందుకు భిన్నంగా ఉపాధి వెతుక్కునే వారి సంఖ్య తగ్గిందనే నివేదికలు సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం నిరుద్యోగ విషయంలో సక్రమంగా వ్యవహరించిందా, లేదా..?ఐదేండ్లలో ఉపాధి వెతుక్కుంటూ బయటకు వచ్చిన వారికి ఉపాధి లభించిందా లేదా అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భూతద్దంలో వెతికిన సరైన సమాధానం రావడం లేదు. పైగా నిరుద్యోగ సమస్య అనేది దరిదాపుల్లో కూడా లేదని మీడియాలో అక్కడి బీజేపీ నేతలు చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటున్నారు.

 నివేదికలు కూడా ప్రభుత్వాలు సూచించినట్టుగా ఉండటమే కాదు,ఉపాధికి విరుద్ధంగా ఉంటున్నాయని నిరుద్యోగుల వాదన. యూపీ లో గత ఐదేళ్లలో శ్రామిక జనాభా అంటే.. 15 ఏళ్లకు పైబడిన జనాభా సుమారు రెండు కోట్ల వరకు పెరిగింది.ఈ జనాభా 14.95 కోట నుంచి 17.07 కోట్లకు చేరింది. ఇంతగా జనాభాలో పెరుగుదల కనిపిస్తే, ఉపాధి లోనూ పెరుగుదలకు  దారితీయాలి. కానీ ఉపాధి అవకాశాలు మాత్రం పెరగలేదు. పైగా ఉపాధి సంఖ్య సుమారు 16 లక్షలు తగ్గింది. నిరుద్యోగ విషయంలో గోవాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐదేళ్ల కిందట గోవా ఉపాధి రేటు దాదాపు 50 శాతం, ఐదేళ్ల తర్వాత అది 32 శాతానికి తగ్గింది.అంటే గోవాలోని శ్రామిక జనాభాలో ముగ్గురు ఉంటే వారిలో ఒకరికే ఉపాధి ఉంది. ఉత్తరాఖండ్ కు కూడా నిరుద్యోగం నుంచి ఉపశమనం లభించలేదు. ఉత్తరాఖండ్లో ఉపాది రేటు 2016 లో దాదాపు 40 శాతంగా ఉండేది. 2021లో అది 30 శాతానికి తగ్గింది. పంజాబ్ లోనూ ఇదే పరిస్థితి. ఇతర దేశాల్లో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు దాదాపు 60 నుంచి 70 శాతం.కానీ భారత్ లో మాత్రం 40 శాతమే.ప్రపంచంలోని ఇతర దేశాల్లోని మొత్తం శ్రామిక జనాభాలో ఎక్కువ మంది ఉపాధిని కలిగి ఉన్నారు.కానీ భారతదేశంలో ఈ సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.

 భారత్ లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఐదేళ్ల ముందు 46 శాతం ఉంటే,ఇప్పుడు అది 40 శాతానికి దిగజారింది.ఇక ఐదేళ్ల ముందు 43 శాతానికి దరిదాపుల్లో ఉపాధి ఉంటే.. ఇప్పుడు 37 శాతానికి చేరింది.రెండు కోట్ల మందికి ఏటా ఉద్యోగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఆ సంగతే మర్చిపోయారు.కరోనా వల్లే ఉపాధి దెబ్బతిన్నదంటూ. సాకుగా చెబుతున్నారు. అందులో భాగంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగ గణాంకాలను తగ్గించి, అబద్ధాలతో గట్టెక్కడానికి అక్కడి పాలకులు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: