త్వరలో తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎందుకో తెలుసా..!

MOHAN BABU
కరోనా ప్రభావంతో ఇప్పటికే దేశంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి అలమటిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడంతో  ఇంతటి అనార్థాలు జరిగాయి. మరి ఇక నుంచి అయినా జాగ్రత్త చర్యలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఏంటో తెలుసుకుందామా..?
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, పలు అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు ఇస్తే ఇప్పటికే ముఖ్యమంత్రిగారు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన కీలక విషయాలను చర్చించడం కోసమే రేపు ప్రగతి భవన్ లో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఒకవైపు సంక్రాంతి సెలువులు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు కొనసాగిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉండడంవల్ల కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల దీనికి సంబంధించి కీలకమైన చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట కర్ఫ్యూ  విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది పండగ వల్ల ఊరికి వెళ్లిన పరిస్థితి. వారందరూ తిరిగి రాగానే నైట్ కర్ఫ్యూ  పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఓమిక్రాన్ కేసులు పెద్దఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి వ్యాక్సినేషన్ ఇవ్వడం. అదేవిధంగా వృద్ధుల్లో తీవ్ర అనారోగ్యంగా ఉన్నవారికి బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలనే ఆదేశాలను జారీ చేశారు. మొత్తానికి కరోనా కేసులు, విద్యాసంస్థల సెలవుల గురించి రేపు ప్రగతిభవన్ వేదికగా రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫారసు మేరకు సెలవులు పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: