గణ‌తంత్ర వేళ మోడీ న‌యా ప్లాన్ ఎందుకంటే?

RATNA KISHORE
గ‌ణ‌తంత్ర ఉత్స‌వాల‌కు రాజ‌కీయాల‌కు ఎటువంటి సంబంధం లేదు. కానీ రాజ‌కీయాలు అన్నీ ఏదో ఒక కార‌ణం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి.అవి మంచివో చెడ్డ‌వో అన్న‌ది అటుంచితే పాల‌న‌కు సంబంధించి కొన్ని మార్పులు కార‌ణంగా అవి మారుతూ ఉంటాయి.ఆ రోజు కాంగ్రెస్ పాల‌న వేరు కానీ ఇప్పుడు మోడీ పాల‌న మాత్రం పూర్తిగా దేశ‌భ‌క్తి చుట్టూ తిరుగుతోంది.దేశ‌భ‌క్తి చుట్టూనే రాజ‌కీయం కూడా నడుస్తోంది. క‌నుక ఫలితాలు కూడా అలానే ఉండ‌నున్నాయి.


దేశాన్ని పాలించే పాల‌కులకు సంబంధించి కొన్నికీల‌క విష‌యాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వ‌స్తుంటాయి. ఆరోజు కాంగ్రెస్ పాల‌న క‌న్నా ఇవాళ బీజేపీ పాల‌న అంత గొప్ప‌గా లేక‌పోయినా కూడా మోడీ ఇలాకాలో వేడుకల‌కు మాత్రం లోటే లేదు.ఆ విధంగా మోడీ అంద‌రి క‌న్నా తానే ప్ర‌త్యేకం అని చాటుకోనున్నారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ను స్మ‌రించినా, వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ను స్మ‌రించినా ఇవ‌న్నీ రాజ‌కీయ అవ‌స‌రాల్లో భాగ‌మే కానీ మోడీ అందుకు అంగీక‌రించేలా లేరు. ఎందుకంటే కాంగ్రెస్ హ‌యాంలో లేని స్మ‌ర‌ణ తమ హ‌వాలో ఉంద‌ని చెప్పుకుంటున్నారాయ‌న‌.
ఈ సారి గ‌ణతంత్ర వేడుకల‌కు సంబంధించి మోడీ కొత్త ప్లాన్ ఒక‌టి వేశారు. దీని ప్ర‌కారం ఈ నెల 24 నుంచి 26 వ‌ర‌కు గ‌ణ‌తంత్ర వేడుక‌లు నిర్వ‌హించాల‌ని ఆలోచిస్తున్నారు. సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ నెల 24 నుంచి ఈ వేడుక‌లు ఆరంభం కానున్నాయి.దీంతో దేశ‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు గ‌ణ‌తంత్ర శోభ‌ను అందించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు మోడీ.దేశ రాజ‌ధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు వేడుకలు జ‌ర‌గ‌నున్నాయి కానీ ప‌రిమిత సంఖ్యలోనే వీక్ష‌కుల‌ను అనుమ‌తిస్తున్నారు.24వేల మంది మాత్రమే గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే గ‌తంలో స‌ర్దార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ ను స్మ‌రించుకున్న విధంగానే ఇప్పుడు నేతాజీని కూడా స్మ‌రించుకుని త‌న‌దైన మార్కులు కొట్టేయాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: