టీఢీపీ : అధినేత మ‌న‌సు మారిపోయింది కానీ?

RATNA KISHORE
ఇప్ప‌టి నుంచి టీడీపీ ప‌నిచేస్తూ పోతే 2024 కు సేఫ్ జోన్ లో ఉండ‌వ‌చ్చు. అందుకు త‌గ్గ ఆలోచ‌న‌లే బాబు చేస్తున్నారు.పార్టీపై ప‌ట్టు ఇంకా లోకేశ్ కు రాలేదు క‌నుక అన్నింటినీ అధినేతే చ‌క్క‌దిద్దుతున్నారు.వీలున్నంత మేర‌కు వ‌యస్సుకు మించి క‌ష్ట‌ప‌డుతున్నారు.త‌న‌దైన వాదం వినిపిస్తూ పార్టీని ఎలా బ‌తికించుకోవాలో కార్య‌క‌ర్త‌ల‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. వారికి ఏక‌ష్టం వ‌చ్చినా కూడా వెంట‌నే అక్క‌డికి చేరుకుని బాధిత వ‌ర్గాల‌తో మాట్లాడుతున్నారు. ప‌రామ‌ర్శ‌ల అనంత‌రం అక్క‌డి నుంచే
అధికార పార్టీ విధానాల‌ను విమ‌ర్శ చేస్తున్నారు.ఇదంతా గ‌తంలో లేదు.కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద‌గా విలువే లేదు అన్న మాట ఒక‌టి వినిపించేది.ఇప్పుడు కొద్దో గొప్పో చంద్ర‌బాబు చేస్తున్న ఆలోచ‌న బాగుంద‌ని కితాబిస్తున్నారు కార్య‌క‌ర్త‌లు.
 
నాయ‌కులే పార్టీకి మూలం అని విశ్వ‌సించ‌డం టీడీపీకి అల‌వాటు. కానీ ఇప్పుడు కార్య‌క‌ర్త‌లే మూల స్తంభం అని భావిస్తున్నారు.దీంతో టీడీపీ సంస్థాగ‌తంగా బ‌ల‌ప‌డే అవ‌కాశాలు వెతుక్కుంటూ, వీలున్నంత వ‌ర‌కూ త‌న వ‌ర్గాన్ని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.అంతేకాదు గ‌తంలో చేసిన త‌ప్పిదాలు కొన్ని దిద్దుకునే ప్ర‌య‌త్నం కూడా చేస్తోంది.కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌య ప‌రిచే ప‌ని కూడా టీడీపీ అధినేత చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రువు పోకుండా ఉండాలంటే క్షేత్ర స్థాయిలో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.బాబుకు ఓ విధంగా ఇవే ఆఖ‌రు ఎన్నిక‌లు కావొచ్చు. వ‌యో భారం రీత్యా ఆయ‌న 2029లో పెద్ద‌గా హ‌డావుడి చేయ‌క‌పోవ‌చ్చు.

ఈ దశ‌లో జ‌గ‌న్ ను ఢీ కొన‌డం త‌ల‌కు మించిన భారంగానే ఉంది. అందుకే టీడీపీ త‌న‌కున్న ప్ర‌తి అవ‌కాశాన్నీ వినియోగించుకోవాల‌నే యోచిస్తోంది.

కార్య‌క‌ర్త‌ల విష‌య‌మై టీడీపీ తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు బాగానే ఉన్నాయి అని ప‌రిశీలకులు అంటున్నారు.ఒక‌ప్పుడు కార్య‌క‌ర్త‌ల‌నే ప‌ట్టించుకోని చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం త‌న పంథా పూర్తిగా మార్చేశారు.వీలున్నంత వ‌ర‌కూ వారికే ప్రాధాన్యం ఇవ్వాల‌ని చూస్తున్నారు.గుంటూరు జిల్లాలో తోట చంద్ర‌య్య హ‌త్య‌కు గురి అయిన సంగ‌తి తెలిసిందే.ఆయ‌న మ‌ర‌ణానంత‌రం రాజ‌కీయాలు విపరీతంగా మారిపోయాయి.చంద్ర‌బాబు పాడె మోసి కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా నిలిచారు.అంతేకాదు చంద్ర‌య్య కుటుంబానికి ఆర్థికంగా అండ‌గా ఉన్నారు.గ‌తంలో క‌న్నా చంద్ర‌బాబులో వ‌చ్చిన మార్పు ఇది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: