ఏపీ పోలీసులపై మరీ ఇన్ని ఆరోపణలా..?

Deekshitha Reddy
ఏపీ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు బాగానే వస్తున్నాయి. కొత్త టెక్నాలజీ ఉపయోగించడంలో, కేసులను త్వరితగతిన పరిష్కరించడంలో కూడా ఏపీ పోలీసులు శెహభాష్ అనిపించుకుంటున్నారు. దిశ యాప్ ద్వారా పోలీస్ సేవలను విస్తృతపరచుకొంటూ మరో సరికొత్త ఒరవడికి కూడా శ్రీకారం చుట్టారు. తాజాగా మహిళా విభాగం ఏర్పాటు చేయడంతో ఏపీ పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టంగా మారింది. కానీ.. మెరుపులతోపాటు మరకలు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఆ మరకల్ని వట్టి ఆరోపణలు అని కొట్టిపారేయాలా..? లేక అధికార పార్టీ ఒత్తిడి ఉంది అనుకోవాలా..?
పోలీస్ వ్యవస్థ, కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇతర అధికారులెవరైనా.. అధికార పక్షానికి గుడ్డిగా కొమ్ముకాయరు. ప్రజల మూడ్ ని బట్టి.. వారు తమ విధులు నిర్వహిస్తుంటారు. ప్రజలు ప్రభుత్వాన్ని అభిమానిస్తున్న క్రమంలో, సహజంగానే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను అధికారులు కూడా ఓన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ప్రభుత్వంపై కూడా అభిమానంగా ఉండటం సహజం. అయితే తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి.
పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని, వారికోసమే పనిచేస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే అంతకంత బదులు తీర్చుకుంటామని చెబుతున్నారు టీడీపీ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై జరిగిన దాడుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ దాడులకు వ్యక్తిగత కక్షలే కారణం అంటూ పోలీసులు తేల్చి చెబుతున్నా.. లోతుగా విచారణ చేపడితే రాజకీయ కక్షలు కనిపిస్తాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటీవల జరిగిన హత్యాకాండని కూడా దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. రాజకీయ కారణాలు ఉన్నా కూడా పోలీసులు వ్యక్తిగత కక్షలుగా కొట్టిపారేశారనేది టీడీపీ ప్రధాన విమర్శ. అదే సమయంలో తాజాగా వైఎస్ఆర్ విగ్రహం మాయం కేసులో కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కావాలనే టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనల్లో పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చిన ఉదాహరణలు లేవు. ఇప్పుడు మాత్రం టీడీపీ నేతలు పోలీసులనే టార్గెట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: