తెలంగాణ స్కూల్స్ సెలవులు పొడగించే అవకాశం..!

MOHAN BABU
 కరోనా నేపథ్యంలో  ఈనెల 8వ తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో భౌతికంగా తరగతులు కష్టమని అభిప్రాయంతో విద్యాశాఖ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు, రేపు అధికారికంగా ప్రకటన  చేసే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో   ఈనెల 17వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.   అలాగే ఈ నెల 20 వరకు కరోనా ఆంక్షలను  పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో ఎల్లుండి  నుంచి విద్యాసంస్థలు తెరచుకొవల్సి ఉంది.  అయితే బౌతిక తరగతులు ఉంటాయా ఉండవా  అనేదానిపై  చర్చ కొనసాగుతోంది.

 మరొకవైపు తెలంగాణ వైద్య శాఖ గాని, విద్యాశాఖ గాని కరోణ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, భౌతిక తరగతులు నిర్వహించడం అంతా సులువు కాదని స్పష్టం చేయడం జరిగింది. భౌతిక తరగతులు గనుక నిర్వహించినట్లు అయితే మళ్లీ కరోణ కేసులు పెరిగే అవకాశముందని అభిప్రాయంతో విద్యాశాఖ ఉంది. ఇప్పటికే విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు వంటి పరిస్థితి ఈనెల 17 నుంచి భౌతిక తరగతులు నిర్వహిస్తే బాగుంటుందా, లేదా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే బాగుంటుందా అనే దానిపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. మరి దీని పైన ప్రభుత్వం ఈరోజు రాత్రి గాని, రేపు గాని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యాశాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈనెల 17 నుంచి ఈ నెల 31 వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జెఎన్ టి యు ఈనెల 17 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని  ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆలోచనతో ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: