ఒమిక్రాన్ : వేడుక‌లా వ‌ద్దు బాబోయ్! ఓవ‌ర్ టు సింహాద్రి!

RATNA KISHORE
క‌రోనా కార‌ణంగా భ‌యాలూ ఆందోళ‌న‌లూ విస్తృతంగానే ఉన్న‌ప్ప‌టికీ జాగ్ర‌త్త‌ల‌యితే లేవు.దీంతో వ్యాధి వ్యాప్తి అన్న‌ది అత్యంత సులువుగానే సాగిపోతోంది.ప్ర‌ధాన మార్గాలూ,కూడ‌ళ్లూ,ఆల‌యాలూ ర‌ద్దీగా ఉన్న వేళ పెద్ద పండుగ వేళే! ఈ వేళ ఎక్కువ మందికి ఈవ్యాధి సోకే అవ‌కాశం ఉన్నా క‌నీస జాగ్రత్త‌లు లేవు. పోలీసులు చెప్పినా కూడా మాస్క్ పెట్టుకోకుండా పండ‌గ ప్ర‌యాణాలు చేస్తున్న వారెంద‌రో! బ‌స్సుల్లో రైళ్ల‌లో ఇలానే ప్ర‌యాణిస్తూ జ‌బ్బు తీవ్ర‌త‌ను పెంచుతున్నారు.ఇక సింహాద్రి అప్ప‌న్న ఆల‌యంలో ఏ త‌ర‌హా స‌మ‌స్య‌లు నెల‌కొన్నాయో చ‌ద‌వండిక‌!
 


ఇరు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వ్యాప్తి విజృంభిస్తోంది. సంక్రాంతి శోభ క‌న్నా క‌రోనా భ‌య‌మే ఎక్కువ‌గా అంద‌రిలోనూ ఉంది.ఊరికి వ‌చ్చామ‌న్న సంబరం క‌న్నా ఊరి నుంచి వెళ్లేట‌ప్పుడు ఇంటికి చేరుకునేట‌ప్పుడు ఏ విధంగా క‌రోనా నుంచి త‌ప్పించుకోవాలో అన్న ఆందోళ‌నే ఎక్కువ‌గా ఉంది.ముఖ్యంగా సంక్రాంతి త‌రువాత జ‌రిగే జాత‌ర‌లు గ్రామాల్లో విప‌రీతంగా ప్ర‌సిద్ధి పొంది ఉంటాయి. ఉత్త‌రాంధ్ర ప‌ల్లెల్లో జాత‌ర‌లు చాలా బాగా నిర్వ‌హిస్తారు. సంక్రాంతి పండుగ త‌రువాత జ‌రిగే ప్ర‌తి జాత‌ర‌కూ ఓ విశిష్ట‌త ఉంటుంది.శ్రీ‌కాకుళం మొద‌లుకుని ప‌శ్చిమ గోదావ‌రి వ‌ర‌కూ జాత‌ర‌లు భలే ఉంటాయి.వీటిపై కూడా ఇప్పుడు నియంత్ర‌ణ త‌ప్ప‌దు.ఇక ప్ర‌ధాన ఆల‌యాల్లో కూడా క‌రోనా సంద‌ర్భంగా ఇదే విధంగా ఆంక్ష‌లు ఉన్నాయి.వీటికి సంబంధించి అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు స్ప‌ష్ట‌మ‌యిన స‌మాచారం అందిస్తూనే ఉన్నారు.


ఈ నేప‌థ్యంలో...క‌రోనా వేళ సింహాచ‌లం అప్ప‌న్న గుడిలో ఆంక్ష‌లు అమ‌ల‌వుతున్నాయి.ఏటా సంక్రాంతి సంద‌ర్భంగా గ్రామంలో జ‌రిగే తిరువీధి కూడా నిషేధించారు. కరోనా వేళ తీర్థ ప్ర‌సాదాల పంపిణీని కూడా వ‌ద్ద‌నుకున్నారు. దీంతో ఏటా జ‌రిగే సంబ‌రం లేక‌పోవ‌డంతో గ్రామ‌స్థులు నిరాశ చెందుతున్నారు. అదేవిధంగా కొన్ని సేవ‌ల‌కు సంబంధించి (ఆర్జిత సేవ‌లు) టికెట్ ధ‌ర‌లు కూడా స‌గానికి స‌గం త‌గ్గించి, దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ అధికారులు సంబంధించి నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి సంక్రాంతి వేళ‌ల్లో సింహాద్రి అప్ప‌న్న గుడికి వేల‌ల్లో భ‌క్తులు వ‌స్తుంటారు. ఆయ‌న ఉత్తరాంధ్రుల‌కు మాత్ర‌మే కాదు యావ‌త్ ఆంధ్రుల‌కూ ఇష్ట దైవం. ప‌క్క రాష్ట్రాల నుంచి కూడా భ‌క్త జ‌నం ఇక్క‌డికి వ‌చ్చి స్వామిని ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు.ఈ నేప‌థ్యం క‌రోనా వ్యాప్తి కాకుండా ఆంక్ష‌ల‌ను విధిస్తూ నియ‌మ నిబంధ‌ల‌ను క‌ట్టుదిట్టంగా అమ‌లు చేసేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: