పాపం ఆ దేశం.. ఆయుధ ప్రయోగాలు.. ఆకలి కేకలు?

praveen
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా దాదాపుగా ప్రజాస్వామ్య పాలన సాగుతోంది. ఇక ఇలాంటి డెమోక్రటిక్ ప్రపంచంలో  కూడా ఇప్పటికీ నియంత పాలన సాగిస్తూ ప్రజలను బానిసలుగా చూస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు దక్షిణకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్. కిమ్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది. ప్రజలు ఎవరూ కూడా కనీసం ప్రభుత్వానికి ఎదురు చెప్పినా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. కింగ్ చెప్పిందే వేదం ఏది చెబితే అదే ప్రజలు పాటించాలి.

 కాదు అని ప్రభుత్వానికి ఎదురుతిరిగే ధైర్యం ఎవరు చేయరు.. ఒకవేళ కిమ్ నియంత పాలన నచ్చక ఎవరైనా ఎదురుతిరిగితే మరునాడు వారు అసలు ఈ ప్రపంచంలోనే ఉండరు. ఇదే ప్రస్తుతం దక్షిణ కొరియాలో సాగిస్తున్న నియంత కిమ్ పాలన. ఇటీవలి దక్షిణ కొరియాలో ఊహించని రేంజిలో ఆహార సంక్షోభం వస్తే ఒక పూట తిండి మానేయాలి అంటూ ప్రజలందరికీ ఆదేశాలు జారీ చేయడం కేవలం నియంత కిమ్ కి మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి. అదే ఒక వైపు దేశంలో ఆహార సంక్షోభం పెరిగిపోతూ ప్రజలందరూ ఆకలితో ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఇటువంటి సమయంలో ఆహార సంక్షోభాన్ని తీర్చాల్సిన అధ్యక్షుడు కిమ్ మాత్రం ఆయుధాల కొనుగోలు కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు.

 ఆయుధాల కొనుగోలు విషయంలో చూపిస్తున్న ఆసక్తిని కనీసం దేశ ప్రజల ఆకలి తీర్చడం లో మాత్రం చూపించడంలేదు నియంత అధ్యక్షుడు కిమ్. అచ్చంగా కేజిఎఫ్ సినిమాలో గనుల్లో ప్రజలను బంధించి బానిసలుగా చేసినట్లుగానే కిమ్ పాలన ఉంటుంది అని విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. ఇటీవలే కొత్త ఏడాదిలో శబ్దానికి మించిన వేగంతో లక్ష్యాన్ని చేరుకునే ఇటువంటి హైపర్ సోనిక్ మిస్సైల్  కి ప్రయోగాలు నిర్వహించారు. ఇక ఇటీవల మరోసారి ఇలాంటి ప్రయోగమే  నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇది కాస్త ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా ఆయుధాలు చూపించి ఇతర దేశాలకు ఇండైరెక్ట్గా మా జోలికి రావద్దు అంటూ వార్నింగ్ ఇవ్వడానికి  కిమ్ ఇలాంటివి చేస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు. ఇలా ఆయుధాల పై పెట్టిన దృష్టి దేశంలో ఆహార సంక్షోభంపై పెడితే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: