బండి-రేవంత్‌ ఎటాక్..కేసీఆర్-కేటీఆర్‌లు బుక్ అవుతున్నారుగా!

M N Amaleswara rao
తెలంగాణలో ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఓ రేంజ్‌లో టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అసలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా టీఆర్ఎస్‌ని ఇరుకున పెట్టడానికి చూస్తున్నాయి. ఓ వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...మరో వైపు టి‌పి‌సిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ఎటాక్ మోడ్‌లో ఉన్నారు. ఇద్దరు అధ్యక్షులు ప్రజా సమస్యలపై పోరాడుతూ...కేసీఆర్ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని చూస్తున్నారు.
రేవంత్ దూకుడుగా రాజకీయం చేస్తుంటే...అంతకంటే ఎక్కువగా బండి రాజకీయం చేస్తున్నారు. అయితే వీరికి చెక్ పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. పైగా కేసీఆర్, కేటీఆర్‌లు సైతం డైరక్ట్‌గా రంగంలోకి దిగేసి...రాజకీయం నడిపిస్తున్నారు. కాకపోతే అనవసరంగా కొన్ని అంశాల్లో బుక్ అయిపోతున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీని ఏదో ఇరుకున పెడదామనుకునే...కేసీఆర్ చిక్కుల్లో పడ్డట్టు అయింది. తాజాగా కూడా ఇలాంటి విషయంలోనే బుక్ అయ్యారు...ఎరువుల ధరల విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రైతులు కాస్త కూలీలుగా మారిపోతున్నారని విమర్శించారు.
ఇక కేసీఆర్ విమర్శలకు బీజేపీ కౌంటర్లు ఇవ్వకుండా ఎందుకు ఉంటుంది. వెంటనే బండి సంజయ్ కౌంటర్లు ఇచ్చేశారు..2017లో ఎరువులని ఉచితంగా ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పింది కాకుండా..రైతులకు న్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ న్యాయం చేస్తున్నారో లేదో గానీ..కేసీఆర్ మాత్రం హామీ ఇచ్చిన మాట వాస్తవం. దీంతో కేసీఆర్ రివర్స్‌లో బుక్ అయ్యారు.
అటు రైతుల సమస్యలపై చర్చకు సిద్ధమని కేటీఆర్, రేవంత్‌కు సవాల్ చేశారు. సవాల్ చేసి కేటీఆర్ వెనక్కి తగ్గారు. పైగా తాను 420లతో చర్చలు చేయనని అన్నారు. దీనికి కౌంటర్లు కూడా పడ్డాయి. టీఆర్ఎస్‌లో ఎంతమంది 420లు ఉన్నారో కేటీఆర్‌కు బాగా తెలుసని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అయ్యాయి. ఇలా కేటీఆర్ బుక్ అయ్యారు. మొత్తానికి రేవంత్-బండిల దూకుడుతో టీఆర్ఎస్‌కు పెద్ద తలనొప్పే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: