`ఆప్` ఆగ‌యా.. పంజాబ్‌లో పాగా వేస్తుందా..?

Paloji Vinay
ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యూపీ త‌రువాత అత్యంత కీల‌క‌మైన రాష్ట్రం పంజాబ్. ఇప్పుడు ఆ రాష్ట్ర‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఎవరికి విజ‌య‌వ‌కాశాలు పెరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయిదేళ్ళు అధికారంలో ఉండటంతో సహజంగానే ప్ర‌భుత్వంపై వ్యతిరేకత వ‌స్తుంది. ఇక పంజాబ్‌లో బీజేపీ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. గతంలో అకాళీద‌ళ్‌తో పొత్తు ఉన్నప్పుడు కొంత ప్రభావం చూపిన కాషాయ‌పార్టీ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేదు అన్న మాట‌లు వినబడుతున్నాయి.

    నిజానికి పంజాబ్లో  కాంగ్రెస్ కు మంచి పట్టు ఉంది అయిదేళ్లలో నాలుగేళ్లు సజావుగా సాగిన పాల‌న‌ చివరి ఏడాదిలో కాంగ్రెస్ కొంత పట్టుకోరు పోయిందనే చెప్పాలి. టీపీసీసీ చీఫ్ గా న‌వ‌జ్య‌త్ సింగ్ సిద్దు ను  చేయడంతో ముఖ్యమంత్రిగా అమరేందర్ సింగ్ రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకోవడం వంటి పరిణామాలు కాంగ్రెస్ ను  దెబ్బ‌తీశాయి. దీంతో మరోసారి పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే నమ్మకం లేదని చెబుతున్నారు. అయితే గెలుపు రేసులో మాత్రం కాంగ్రెస్ ముందు వరుసలోనే ఉంది.. కానీ ఈసారి అనూహ్యంగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

   ఆప్ కచ్చితంగా వచ్చి అధికారంలోకి వస్తుందన్న విశ్లేషణలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. అయితే ఇదే పరిస్థితి 2017 లోనూ కనిపించిందని.. కానీ అప్పుడు 20 స్థానాలకు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితమైంది. అప్పుడు కూడా ఆప్ కు మంచి ఆదరణ అభించింద‌ని కానీ ఫలితాలు మాత్రం అది కనబడలేదు అనే వారు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడంతో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గాల్లో స‌త్తా చాటే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. త్వ‌ర‌లోనే పంజాబ్  పర్యటనకు వెళ్లనున్నారు. మొత్తం మీద మరోసారి ఆ పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి గత ఎన్నికల మాదిరిగానే డీలా పడుతుందా లేదా సీఎం కుర్చీ దక్కించుకుంటుందా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: