కొండా విశ్వేశ్వర్ రెడ్డి దారి ఏ పార్టీ వైపు..!

MOHAN BABU
కొండా విశ్వేశ్వరరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బాట పట్టనున్నారా?  అందుకే ఉద్యోగుల జీవో 317 పై కాంగ్రెస్  తో కలిసి పోరాటం చేయనున్నారా? రాజకీయాల్లో నేతలు పార్టీ మారడం చాలా సహజం. వీటిని జనం కూడా పెద్దగా పట్టించుకోరు.అయితే ఏ పార్టీలో లేని నేతలు రెండు ప్రధాన పార్టీలతో సన్నిహితంగా ఉండటం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. తెలంగాణలోని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ కోవలోకే వస్తారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అంతరంగం అంతుచిక్కడం లేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో,ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారో గందరగోళంగా ఉంది. ఆయన నడవడిక, తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ విశ్లేషకులకు కూడా పజిల్ గా మారాయట.

తమ నేత ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదని ఆయన అనుచరులు కూడా చర్చించుకుంటున్నారట. ఈ గందరగోళానికి కారణం ఆయన తాజాగా కాంగ్రెస్ దీక్ష శిబిరంలోప్రత్యక్షం కావడమేనట. ఈయన 2014లో టిఆర్ఎస్ లో చేరిచేవెళ్ల నుంచి గెలుపొందారు. తర్వాత కేటిఆర్ తో పొసగక పార్టీ నుండి బయటకు వచ్చారు. 2019లో కాంగ్రెస్ లో చేరి చేవెళ్ల నుండి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. పార్టీ నిర్ణయాలు నచ్చకపోవడంతో సంవత్సరం క్రితం రాజీనామా చేశారు. రేవంత్ పీసీసీ పదవి చేపట్టాక పార్టీలోకి తిరిగి వస్తానని చాలామంది భావించారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల కి సపోర్ట్ చేశారు. ఆ సమయంలో అందరూ బిజెపిలో చేరుతారని అంటున్నారు. కానీ రేవంత్ పిసిసి అయ్యాక సీన్ మారిపోయింది. తనకు సన్నిహితుడైన రేవంత్ పిసిసి కావడంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించు కున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ కాంగ్రెస్ లో అధికారికంగా ఇంకా చేయలేదు.తాజాగా పరిగి లో కాంగ్రెస్ దీక్షా శిబిరంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. కొండా చూపు కాంగ్రెస్ వైపేనంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయట. కానీ ఆయన మాత్రం పెదవి విప్పడం లేదు. ఎన్నికల టైం చూసి పార్టీలో చేరతారని, అందుకే జిల్లాలో జరిగిన కాంగ్రెస్ దీక్షలో పాల్గొన్నారని పలువురు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల నాటికి కొండా ఏదో ఒక పార్టీలో చేరవచ్చన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆయన అడుగులు ఎటు వైపు అన్న చర్చ కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: