రేవంత్‌ కరెక్ట్ లాజిక్‌లు..కానీ నో యూజ్?

M N Amaleswara rao
తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ ఓ రేంజ్‌లో నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి. అసలు ఓ రేంజ్‌లో రెండు పార్టీల మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్‌లో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. అసలు వాస్తవానికి చెప్పాలంటే బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ బలం ఉంది...రాష్ట్రంలో బలమైన క్యాడర్, బలమైన నాయకులు ఆ పార్టీకే ఉన్నారు. మరి అలాంటప్పుడు బీజేపీ ఎందుకు హైలైట్ అవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి. ఉపఎన్నికలో, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది.
అంత మాత్రాన బీజేపీ బలం పెరిగినట్లేనా అంటే కాదని చెప్పొచ్చు. కానీ బీజేపీని టీఆర్ఎస్ పైకి లేపుతున్నట్లు కనిపిస్తోంది. దీని వెనుక ఒక లాజిక్‌ కూడా ఉంది. బీజేపీని హైలైట్ చేస్తే కాంగ్రెస్ వెనుకబడుతుంది. అప్పుడు రెండు పార్టీల మధ్య ఓట్ల చీలిక పెరుగుతుంది. అప్పుడు తమకు బెనిఫిట్ అవుతుందని టీఆర్ఎస్ భావిస్తుంది. ఇదే విషయాన్ని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు.


అసలు టీఆర్ఎస్-బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని అంటున్నారు. పైకి డ్రామా అన్నట్లు కనిపించకపోయినా కొన్ని లాజిక్‌లు చూస్తే నిజమే అనిపిస్తోంది. ఇక ఇలా రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బెనిఫిట్ అయ్యేలా బీజేపీ చేస్తుంటే..అటు కేంద్రంలో బీజేపీకి బెనిఫిట్ అయ్యేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. దానికి కూడా కొన్ని లాజిక్‌లు చెబుతున్నారు. వాస్తవానికి కమ్యూనిస్టులు, డి‌ఎం‌కే, ఎన్సీపీలు కాంగ్రెస్‌తో కలిసి ఉన్నాయి. కానీ ఆ పార్టీలని కేసీఆర్ కలుస్తున్నారు.
ఇటీవల డి‌ఎం‌కే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ని కలిసిన కేసీఆర్...తాజాగా కమ్యూనిస్ట్ నేతలతో భేటీ అయ్యారు. కేరళ సీఎం విజయన్‌తో పాటు ఇతర జాతీయ కమ్యూనిస్టులని కలిశారు. అయితే కాంగ్రెస్‌ని దెబ్బకొట్టి బీజేపీకి లాభం జరిగేలా చేయడానికే కేసీఆర్ ఇలా థర్డ్ ఫ్రంట్ అంటూ నాటకాలు ఆడుతున్నారని రేవంత్ అంటున్నారు. ఇక రేవంత్ లాజిక్‌లు బాగానే ఉన్న...వాటిని నమ్మే వారు లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: