నెల్లూరు జిల్లా : పాఠశాలలో వివక్ష... చిన్నారుల తప్పేంటి ?


నెల్లురు జిల్లాలోని ఓ పాఠశాలలో వివక్ష చూపారు. ఆ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థలను  కారణం చూపి ఇంటికి పంపిచేశారు. ఈ విషయం ఉన్నతాధికారులతు తెలిసింది. దీంతో వారు చర్యలు చేపట్టారు. ఫోన్ ద్వారా పిల్లలతోనూ, ఉపాధ్యాయులతో నూ మాట్లాడారు. సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతకీ అక్కడి పిల్లలు ఏం చేశారు ?  వారు చేసన తప్పేమిటి ?
భారత దేశప్రతిష్ఠను పెంచే శ్రీహరి కోటకు దాదాపు పది మైళ్ల దూరంలో ఉంది ఆ ఊరు.  అంతే కాదు ప్రపంచం లోనే అతి స్క్రీన్ ఉన్న థియేట కూడా ఈ ఊరికి కూత వేటు దూరంలోనే ఉంటుంది.  అక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. తిరుమల తిరుపది దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు వేనాటి రామచంద్రా రెడ్డి స్వగ్రామం కూడా అదే. ఇంతకీ ఆ ఊరు పేరు చెప్పలేదు కదా. ఈ ఊరి పేరు మావిళ్లపాడు.చెన్నై- ముంబయి రహదారికి దాదాపుగా ఆనుకునే ఉంటుందా ఊరు. ఈ గ్రామంలో ప్రభుత్వం ఆదర్శ పాఠశాల నడుపుతోంది. ఆ  పాఠశాలలో మావిళ్లపాడు నుంచే కాకుండా  చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి కూడా పిల్లలు విధ్యనభ్యసిస్తున్నారు.  ఆ పాఠశాల చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని, విద్యాబుద్దులు నేర్పించడం లో అక్కడి సిబ్బంది కరుకుగా వ్యవహరిస్తారని పేరుంది. దీంతో చాలా మంది తల్లితండ్రులు ఆ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు ఉవ్విళ్లూరుతారు. గురువారం ఆ పాఠశాలలో ఒకసంఘటన జరిగింది. పిల్లలు బూట్లు వేసుకు రాలేదని పాఠశాల సిబ్బంది వారిని బడిలోనికి రానీయలేదు. దీంతో విద్యార్థులు పాఠశాల వెలుపలే నిరీక్షించాల్సి వచ్చింది. తాజాగా నేడు కూడా పిల్లలు కొందరు బూట్లు వేసుకుని  రాకపోవడంతో వారిని పాఠశాల లోనికి అనుమతించ లేదు. ఈ విషయం తేలుసుకున్న విద్యాశాఖాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిఫాం లేదని, బూట్లు వేసుకుని రాలేదని పిల్లలను బడిలోనికి రానివ్వక పోవడం తగదని వారు పేర్కోన్నారు. విద్యార్థులపై వివక్షత చూపడం  శోచనీయమని, శాఖా పరంగా విచారణ చేస్తామని అధికారులు పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: