కత్తులు నూరుతున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఆయన తోక కట్..!

MOHAN BABU
తెలంగాణ కాంగ్రెస్ కోసం హైకమాండ్ కత్తెర పట్టుకొని రెడీగా ఉందా. తోక జాడిస్తే కట్ చేసేందుకు దాన్నీ నూరుతుందా. ఇప్పటికే కొందరి నోటికి తాళం వేసిన అధిష్టానం పెద్దలు మిగిలిన సీనియర్లను ఎలా కట్టడి చేయబోతున్నారు? గాంధీ భవన్ కు ఇప్పుడొకరకమైన భయం పట్టుకుందన్న ప్రచారం తెలంగాణ కాంగ్రెస్ ను చుట్టేస్తుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి,జగ్గారెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్ గా చూస్తోందట. ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ రావడానికి కారణమైన అంశం ఏంటని ఆరాతీస్తోందట. పైకి మెత్తగా కనిపిస్తూ లోపల కత్తులు దించుతున్న సీనియర్ల విషయాన్ని సీరియస్ గా అబ్జర్వ్ చేస్తోందట. ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు మాత్రం ఇంకో రకమైన బెంగ పట్టుకుంటోందట.

 కత్తెర పట్టుకొనే హస్తిన నుంచి ఫ్లైట్ దిగుతున్న అధిష్టానం పెద్దలు హస్తం పార్టీలో ఉంటూ కోవర్టు ఆపరేషన్ చేస్తున్న నేతలు ఏ మాత్రం తోక జాడించిన కట్ చేసేందుకు ఆ కత్తెరకు పదును పెడుతున్నారట. కొత్త ఇంచార్జి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కొరకరాని కొయ్యలా మారిపోయారట. ఒక్కొక్కరిని కట్టడి చేస్తూ వస్తున్న ఠాగూర్ సీనియర్లయిన సరే చెప్పిన మాటకు కట్టుబడే ఉండాల్సిందేనని శాసిస్తున్నారట. తేడా వచ్చిందంటే సోనియాగాంధీ ముందే నివేదిక పెడతామంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో ఢీ అంటే ఢీ అంటున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తో పాటు సైలెంట్ గా ఉంటూ వైలెంట్ పాలిటిక్స్ చేస్తున్న మరికొందరి నేతల ఇష్యుని కూడా సీరియస్ గా చూస్తున్నారట.

ఎంత కాదనుకున్నా రేవంత్ పీసీసీ కాబట్టి ఆయన నిర్ణయాలు కొన్ని నచ్చకున్నా పార్టీ ఫ్యూచర్  ని దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ చేయకుండా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదని అధిష్టానం పెద్దలు కొందరు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారట. జగ్గారెడ్డి ఇష్యునే బయట ప్రపంచానికి కనిపిస్తుంది కానీ లోలోపల సైలెంట్ వ్యూహాలు అమలు చేస్తున్న మరికొందరు సీనియర్ల విషయాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తోందట. ఇప్పటికే వీహెచ్ హనుమంతరావు లాంటి సీనియర్ నాయకులే మాట దొర్లకుండా జాగ్రత్త గా మాట్లాడుతున్నారు.జగ్గారెడ్డి ఇష్యూని సీరియస్ గా ప్రస్తావనకు తెస్తారని, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతుంది. ఈ ఇష్యులో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో, జగ్గారెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగనుందో కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: