బండితో గంగులకు బ్రేక్ పడేలా ఉందిగా!

M N Amaleswara rao
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చాలా దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. అసలు కేసీఆర్‌పై ఒంటికాలి మీద వెళ్లిపోతున్నారు. మొన్నటివరకు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే...కేసీఆర్‌పై విరుచుకుపడతారన్నట్లు పరిస్తితి ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్‌ని మించి బండి దూకుడు పెంచారు. ఎక్కడకక్కడ టీఆర్ఎస్‌పై ఫైర్ అవుతూ వస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు..తీవ్రంగా పోరాడుతున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు..దీక్షలు చేస్తున్నారు.
పైగా కేంద్ర పెద్దలు కూడా బండికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు..దీంతో బండి మరింత దూకుడుతో పనిచేస్తున్నారు. బండి దూకుడు బీజేపీకి బాగా ప్లస్ అవుతుంది. అసలు బండి అధ్యక్షుడు అయ్యాకే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ రేసులోకి వచ్చిందని చెప్పాలి. బండి వచ్చాకే బీజేపీలో మార్పు వచ్చింది. ఇలా దూకుడుగా ఉంటున్న బండి... నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి బీజేపీని అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్‌పై పోరాటాలే కాకుండా..క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి బండి ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆ దిశగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ బలహీనంగా ఉన్న రిజర్వడ్ స్థానాలపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు.


అయితే ఇలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న బండి..తన సొంత నియోజకవర్గం కరీంనగర్ అసెంబ్లీలో కూడా బలపడాల్సిన అవసరముంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
కానీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీకి దిగుతారు. అయితే కరీంనగర్ అసెంబ్లీలో మంత్రి గంగుల కమలాకర్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆయనకు చెక్ పెట్టడం సులువు కాదు. కాకపోతే టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరగడం, పైగా బండి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉండటం, గతంలో ఓడిపోయిన సానుభూతి ఉండటం వల్ల ఈ సారి బండికి కలిసిరావచ్చు. మరి చూడాలి గంగులకు బండి బ్రేక్ వేయగలరో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: