రేవంత్ Vs జ‌గ్గారెడ్డి : కేటీఆర్‌ను క‌లిస్తే త‌ప్పేంటి..?

N ANJANEYULU
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మ‌రొక‌సారి విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాను టీఆర్ఎస్ ఏజెంట్‌గా ప‌ని చేస్తున్నాను అని ఇటీవ‌ల కొన్ని సోష‌ల్ మీడియా ఛాన‌ళ్లు విప‌రీతంగా ప్ర‌చారం చేసాయ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు. ఛాన‌ళ్లు రేవంత్‌రెడ్డికి అభిమానులుగా ప‌ని చేస్తున్నాయి అని, రేవంత్‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వీ ఇవ్వ‌క‌ముందు మూడేండ్ల కిందటే రాజు వ‌స్తున్నాడ‌ని తెగ హ‌డావిడి చేసిన‌ట్టు గుర్తు చేసారు. ఇటీవ‌ల సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అధికారిక కార్య‌క్ర‌మంలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నాను అఇ.. కేటీఆర్ ఎదురు ప‌డితే ప‌ల‌క‌రించాను అని జ‌గ్గారెడ్డి వివ‌రించారు.
పార్టీలు వేరు అయినా ఎదురుప‌డిన‌ప్పుడు మాట్లాడుకోవ‌డం సంస్కారం అని స్ప‌ష్టం చేసారు. కేటీఆర్‌ను గ‌తంలో కాంగ్రెస్ నేత‌లు ఎవ్వ‌రూ క‌లువలేదా అని ప్ర‌శ్నించారు జ‌గ్గారెడ్డి. త‌న‌ను టీఆర్ఎస్ కోవ‌ర్టు అంటూ కొంద‌రూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు అని ఆగ్ర‌హం వ్యక్తం చేసారు. కాంగ్రెస్‌లో వ్య‌క్తిగ‌త పంచాయ‌తీలు లేవు అని, పార్టీలోని చిల్ల‌ర బ్యాచ్ త‌న‌ను మీడియా ముందుకు వ‌చ్చేలా చేస్తుంద‌ని జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హమ‌య్యారు. నెగిటివ్ వార్త‌లు రాసే వారికి ఆత్మ‌సాక్షి లేదా అని నిల‌దీసారు. పీసీసీ చీఫ్ అనే వాడు పార్టీకి డ్రైవ‌ర్ లాంటి వాడు అని, తాము ఫ్యాసింజ‌ర్లం మాత్ర‌మే అని అభిప్రాయం వ్య‌క్తం చేసారు.
ముఖ్యంగా తాను పార్టీ నుంచి బ‌య‌ట‌కెళ్లాల‌నుకుంటే ఆపేది ఎవ‌రు అని నిల‌దీసారు. టీఆర్ఎస్‌లోకి వెళ్లాల‌నుకుంటే డైరెక్ట్ వెళ్లుతాను అని.. కోవ‌ర్టుగా ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేదు అన్నారు. రేవంత్‌రెడ్డి డైరెక్ష‌న్‌లోనే చిన్నారెడ్డి ప‌ని చేస్తున్నారు అని ఆరోపించారు జ‌గ్గారెడ్డి.  రేవంత్‌రెడ్డి గురించి చాలా చెబుతా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా గ‌ట్టిగా ఉన్న‌ది. ఎవ్వ‌డో వ‌చ్చి గ‌ట్టిగా చేసేది ఏంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బ‌లంను గ‌ట్టి చేస్త‌రా..?  సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల నాయ‌కత్వంలోనే బ‌ల‌ప‌డుతుంది. అవ‌స‌రం వ‌స్తే కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, బీజేపీ నాయ‌కుల‌పై అడ్డంగా నిల‌దీసే శ‌క్తి  త‌న‌కు ఉంద‌ని.. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మాట్లాడుతా అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: