తెలుగులో మ‌రో కొత్త న్యూస్ చానెల్ వెన‌క ఆ టాప్ లీడ‌ర్‌...?

VUYYURU SUBHASH
రాజకీయాల్లో రాణించాలంటే మీడియా సపోర్ట్ ఎలా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మీడియా సపోర్ట్ తోనే ఈ రోజు దేశాలకు దేశాలను ఏలేస్తున్నారు. తిమ్మిని బమ్మిని చేసి చూపించే శక్తి మీడియా కు మాత్రమే ఉంది. ఇక ఇండియాలో రాజకీయాలకు.. మీడియాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల్లో రాణించాలంటే ఖచ్చితంగా మీడియా అండదండలు ఉండాల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎప్పటికీ ఇక్కడ ఉన్న మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి.

ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక టీవీ ఛానల్ నెలకొల్పాలని ఆలోచనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఆయన ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే ముందుగా శాటిలైట్ ఛానల్ ను ప్రారంభించకుండా... యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అనంతరం దాని ద్వారానే 24 గంటలు కార్యక్రమాలు ప్రసారమయ్యే ఛానల్ గా మార్చాలని ఆలోచనతో రేవంత్ ప్రణాళిక రెడీ చేసుకున్నారని... ఈ క్రమంలో మీడియాలో పెద్ద తలకాయలుగా ఉన్న వారితో ఆయన సలహాలు... సంప్రదింపులు చేస్తున్నారని తెలిసింది.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. వచ్చే 2023 ఎన్నికలు ఆయన రాజకీయ జీవితానికి కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీని గెలిపిస్తే రేవంత్ భవిష్యత్తుకు తిరుగు ఉండదు. లేకపోతే రాజకీయంగా ఆయనకు ఇబ్బందులు తప్పవు. తెలంగాణలో అధికార పార్టీని కొట్టాలంటే రేవంత్ రెడ్డికి కూడా బలంగా మీడియా సపోర్ట్ ఉండాలి. ఇప్పటికే తెలంగాణలో మీడియా సంస్థలు కెసిఆర్ కు అనుకూలంగా సపోర్టు చేస్తున్నాయి.

కేసీఆర్ దెబ్బకు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలకు... మిగిలిన మీడియా సంస్థలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు అక్కడ బలంగా ఉన్నాయి. దీంతో ఒక ఛానల్ స్థాపిస్తే అప్పుడు ఎవర్ని అడుక్కోవాల్సిన అవసరం ఉండదన్న భావనతోనే రేవంత్ ఛానల్ పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: